Pawan Kalyan: పూర్తిగా కోలుకున్న ప‌వ‌న్.. ఇక ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసేందుకు సిద్ధం

Pawan Kalyan: అజ్ఞాతవాసి చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు మానేసిన సంగతి తెలిసిందే. రాజ‌కీయాల వ‌ల‌న తాను సినిమాల‌కు పూర్తి దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత అభిమానులు చాలా నిరాశ చెందారు. ఇక మ‌న హీరోని వెండితెర‌పై చూడ‌లేమా అని డీలా ప‌డ్డారు. కాని ఆక‌స్మాత్తుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా షూటింగ్ వ‌డివ‌డిగా పూర్తి కావ‌డం , ఈ ఏడాది రిలీజ్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి.

Pawan Kalyan

వకీల్ సాబ్ చిత్రం గ‌త ఏడాది విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. వ‌కీల్ సాబ్ త‌ర్వాత పవ‌న్ క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు ప్ర‌క‌టించ‌డంతో ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని అంత‌లోనే క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లు కావ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌రోనా బారిన ప‌డ‌డంతో అంచ‌నాలు పూర్తిగా తారుమార‌య్యాయి.

Pawan Kalyan

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి క‌రోనా సోకింద‌ని తెలిసి అభిమానులు టెన్ష‌న్ ప‌డ్డారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ఉంద‌ని, కొద్ది రోజులు ఆయ‌న విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు చెప్ప‌డంతో ప‌వ‌న్ కొన్నాళ్లుగా బ‌య‌ట‌కి రావ‌డ‌మే మానేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో పాటు షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వ‌డంతో ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రాలు సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ద‌మయ్యాయి.

మ‌రి కొద్ది రోజుల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జ‌రుపుకోనుంది. సాగ‌ర్ కె చంద్ర ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా మొద‌లు పెట్టేశాడ‌ట‌. జూలై రెండోవారం నుండి చిత్రం షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది. రానా, ప‌వ‌న్‌ల‌పై ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైను హ‌రిహ‌ర వీర‌శంక‌ర అనే సినిమా షూటింగ్‌లోను ప‌వ‌న్ పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది.