Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే రికార్డ్ కొట్టిన సుడిగాలి సుధీర్

Pawan kalyan : మన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనంత మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు కావొచ్చు. కానీ.. అతను వాళ్లందరూ కాలర్ ఎగరేసుకునేంత గొప్ప గుర్తింపు పొందాడు. నిజంగా సుడిగాలిలాగే బుల్లితెర మీదికి దూసుకొచ్చిన సుధీర్ ప్రస్తుతం టీవీ తెరపై తిరుగులేని కమెడియన్ గా వెలిగిపోతున్నాడు.

అందరివాడు..

ఈ రోజుల్లో సుడిగాలి సుధీర్ అంటే తెలియనివారులేరు. ఎదుటివాళ్లు తనపై వేసే పంచ్ డైలాగ్ లకి సుధీర్ సింపుల్ గా ఇచ్చే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టిస్తుంటాయి. ముఖ్యంగా జబర్దస్త్ షోలో ఆటో రాంప్రసాద్, గెటప్ శీనుతో కలిసి సుడిగాలి చేసే హంగామా మామూలుగా ఉండట్లేదు. కడుపుబ్బా నవ్వించే ఆ ఖతర్నాక్ కామెడీ షోకే ఈ కాంబినేషన్ హైలైట్ లా నిలుస్తోంది. రష్మీతో లవ్ ట్రాక్ కూడా సుధీర్ కి బాగా ప్లస్ అవుతోంది.

నేషనల్ లెవల్లో : Pawan kalyan

సుడిగాలి సుధీర్ ప్రతిభ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. లేటెస్టుగా అతను నేషనల్ బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో తెలుగు నుంచి సెలెక్ట్ అయిన ఒకేఒక్కడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. చిన్న తెరపై ఉత్తమ యాక్టింగ్ ప్రదర్శించే నటీనటులను ఆర్మాక్స్ మీడియా ఏటా సెలెక్ట్ చేస్తుంది. గతేడాదికి సంబంధించి ఎంపికైనవారి లిస్టును ఈమధ్యే రిలీజ్ చేసింది.

Pawan-kalyan-fan-sudigali-sudheer-got-national-award
Pawan-kalyan-fan-sudigali-sudheer-got-national-award

‘మెగా’నందం..

రియాల్టీ షోలతో ప్రారంభమైన సుడిగాలి సుధీర్ కెరీర్ వెండి తెర మీదికి కూడా వేగంగానే ఎక్కింది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీమంకీస్’ తదితర మూవీస్ లో లీడింగ్ రోల్స్ చేశాడు. అవి ఆశించిన స్థాయిలో ఆడకపోయినా సుధీర్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే ఈ ‘సుడి’గాడు తన అభిమాన నటుణ్ని పలు సందర్భాల్లో వివిధ స్టేజ్ షోల్లో అనుకరిస్తూ, అలరిస్తూ ఉన్నాడు. ఏకంగా పవర్ స్టార్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో యాక్ట్ చేశాడు. ఆ చిత్రం కూడా హిట్ కాకపోయినా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలనే లైఫ్ టైమ్ కోరికను సుధీర్ తీర్చుకున్నాడు. ఇప్పుడు నేషనల్ లెవల్ అవార్డు పొంది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా చేశాడు.

Advertisement