Pawan kalyan: ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. న‌లుగురు పిల్ల‌ల‌తో గ్రూప్ ఫొటో దిగిన ప‌వ‌న్

Pawan kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈపేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటార‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఆయ‌న సినిమాల గురించి, ప‌వ‌న్ టూర్స్, ఫ్యామిలీ ఇలా ప్ర‌తి అంశంపై ఆస‌క్తి చూపుతూ ఉంటారు. ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీబిజీగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల క్రిస్మ‌స్ కోసం ర‌ష్యా వెళ్లి వ‌చ్చారు. భార్య అన్నా లెజినోవా పిల్లలు రష్యాలో ఉండగా వారి కోసం ర‌ష్యా వెళ్లి కొద్ది రోజుల త‌ర్వాత హైద‌రాబాద్‌కి తిరిగి వ‌చ్చారు.

pawan kalyan enjoying with his family1
pawan kalyan enjoying with his family1

హైదరాబాద్ లో లాండ్ అయిన త‌ర్వాత‌ పవన్ కళ్యాణ్ క‌ళ్యాణ్ ఫొటోలు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎయిర్ పోర్ట్‌లో త‌న‌ అభిమాన హీరో నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బ్లాక్‌ అండ్‌ షేడ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో పవన్‌ అదిరిపోయాడు. పవన్ లుక్ సూపర్బ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అనంత‌రం ప‌వ‌న్ త‌న త‌ల్లి, శ్రీమ‌తితో క‌లిసి దిగిన పిక్స్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఈ పిక్ తెగ వైర‌ల్ అయింది.

ఇక ఇప్పుడు ప‌వన్ త‌న న‌లుగురు పిల్ల‌ల‌తో పాటు అన్నా లెజినోవాతో క‌లిసి గ్రూప్ ఫొటో దిగ‌గా, ఈపిక్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఇందులో అంద‌రు చాలా సంతోషంగా క‌నిపిస్తున్నారు. అయితే ఈ పిక్ వారం క్రితంది అయి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. అందుకు కార‌ణం ప్ర‌స్తుతం అకీరా క‌రోనాతో ఐసోలేష‌న్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

ఇక ఇప్పటికే ప‌వ‌న్ న‌టిస్తున్న‌ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో హరహర మల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది.

pawan kalyan enjoying with his family1
pawan kalyan enjoying with his family1

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి కూడా పవన్ ఒకే చెప్పాడు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరస సినిమాలతో పవన్ కళ్యాణ్ 2022 క్యాలెండర్ ఫుల్ బిజీ అన్నమాట. అయితే ప‌క్కా ప్రణాళిక‌తో ప‌వ‌న్ ఉండ‌గా, ఆయ‌న ప్లాన్స్‌కి క‌రోనా బ్రేక్ వేసిన‌ట్టే క‌నిపిస్తుంది. గ‌త ఏడాది క‌రోనా బారిన ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.