Pawan: హ‌రీష్ శంక‌ర్ సినిమాలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ప‌వ‌న్

Pawan: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా గబ్బర్ సింగ్. దాదాపు 11 ఏళ్ల పాటు ఎలాంటి విజయం లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ కు.. గబ్బర్ సింగ్ సినిమాతో 9 ఏళ్ళ కింద ఎప్పటికీ మరిచిపోలేని విజయం అందించాడు హరీష్ శంకర్. ఇది పేరుకు హిందీ సినిమా రీమేక్ అయినా కూడా స్ట్రైట్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించాడు హరీష్. నిజానికి గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత ఒరిజినల్ దబాంగ్ సినిమా చేసిన సల్మాన్ ఖాన్ మెచ్చుకున్నాడు. తమకంటే సినిమా చాలా బాగా తెరకెక్కించారు అంటూ హరీష్ శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు సల్మాన్.

Pawan

ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. దాంతో అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హరీష్ శంకర్ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఇక దీన్ని ఆలస్యం చేయకూడదని పవన్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు కమిట్మెంట్ ఇచ్చి సంవత్సరం దాటిపోయింది.

Pawan

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి కొడుకులుగా పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. తండ్రి పాత్ర పోలీస్ ఆఫీసర్ అని.. అలాగే కొడుకు పాత్ర సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ రెండు క్యారెక్టర్స్ ను హరీష్ శంకర్ అదిరిపోయేలా డిజైన్ చేశాడని.. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు యూనిట్ సభ్యులు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుంది. ప్రతి నెలలో 10 రోజులు హరీష్ శంకర్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలకు కూడా కమిట్మెంటు ఇచ్చాడు పవర్ స్టార్. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర సినిమా కూడా లైన్ లోనే ఉన్నాయి.

Pawan

వీటితో పాటు మరో మూడు సినిమాలు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి నెలకు పది రోజులు హరీష్ సినిమాకు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ అందించిన హరీష్ శంకర్.. ఈసారి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సోషల్ మెసేజ్ ఉన్న కథతో వస్తున్నాడు. మొత్తానికి ఈ అప్డేట్ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.