Pawan Kalyan And Allu Aravind :  వైరల్‌ పిక్‌ : అల్లు అరవింద్ ను అవమానించిన పవన్‌ కళ్యాణ్‌

NQ Staff - January 30, 2023 / 02:27 PM IST

Pawan Kalyan And Allu Aravind :  వైరల్‌ పిక్‌ : అల్లు అరవింద్ ను అవమానించిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan And Allu Aravind  : నేడు పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ఇంకా పలువురు హాజరయ్యారు.

నేడు ఉదయం నుండి కూడా ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క ఫోటో ని సోషల్ మీడియాలో కొందరు తెగ షేర్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా యాంటీ పవన్ ఫ్యాన్స్, ఇంకా మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వారు ఈ ఫోటో ను వైరల్ చేస్తూ అల్లు అరవింద్ ని పవన్ కళ్యాణ్ అగౌరవపరిచాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మర్యాద కొద్దీ అల్లు అరవింద్ షేక్‌ హ్యాండ్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు అంటూ ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.

Pawan Kalyan Disrespected Allu Aravind

Pawan Kalyan Disrespected Allu Aravind

ఈ ఫోటో లో ఉన్నది నిజం కాదని… కనిపిస్తున్నది వాస్తవం కాదని మెగా ఫాన్స్ తో పాటు అందరూ కూడా గుర్తించగలరు. అల్లు అరవింద్ ఒకవేళ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లయితే అది గమనించని పవన్ కళ్యాణ్ వెంటనే గమనించి తిరిగి సెకండ్ ఇచ్చేవాడు, లేదంటే అల్లు అరవింద్ ఏదైనా విషయాన్ని వివరిస్తున్న సమయంలో చెయ్యి అలా అని ఉండవచ్చు.

అది పవన్ కళ్యాణ్ కి షేక్ అందిస్తున్నట్లుగా అనిపించి ఉండవచ్చు. అంతే తప్పితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని అనడానికి లేదు, అలాగే అల్లు అరవింద్ ని అగౌరవపరిచినట్లు లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us