Pawan Kalyan : అలీ కూతురు పెళ్లి.. నిజంగానే పవన్ కి ఆహ్వానం అందలేదు
NQ Staff - November 29, 2022 / 09:35 AM IST

Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట జరిగిన పెళ్లి వార్తల్లో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున ఇంకా రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పెళ్లి వేడుకలో హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. పవన్ కు అలీ అంటే చాలా అభిమానం. ఒకానొక సమయంలో తన ప్రతి సినిమాలో కూడా అలీ ఉండాల్సిందే అంటూ పాత్రలను క్రియేట్ చేయించి పెట్టేవాడు.
సినిమాల వరకు పవన్ మరియు అలీ సన్నిహితులు. కానీ రాజకీయం వచ్చే వరకు పవన్ కళ్యాణ్ పార్టీకి పూర్తి వ్యతిరేకం అయిన వైకాపా లో అలీ జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వడం మాత్రమే కాకుండా నామినేటెడ్ పదవిని కూడా అలీ దక్కించుకున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను కూడా అలీ విమర్శించడం జరిగింది.
రాజకీయాలతో ఎంతగా విభేదించినా కూడా అలీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను తన కూతురు పెళ్లికి పిలుస్తాడని.. ఆ పెళ్లిలో పవన్ సందడి చేస్తాడని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ కు అలీ నుండి ఆహ్వానం అందలేదు అంటూ జనసే వర్గాల నుండి సమాచారం అందుతోంది. అలీ తో ఉన్న సన్నిహిత్యం కారణంగా పవన్ తప్పకుండా పెళ్లికి హాజరు అయ్యేవాడు.
కానీ తన వైకాపా నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ను పెళ్లికి ఆహ్వానించలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలీ ఈ పెళ్లి వేడుకలో ఎంత హంగామా చేసినా కూడా ఎంతో మంది ప్రముఖులు వచ్చినా కూడా పవన్ రాకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలీ తీరును చాలా మంది తప్పుబడుతున్నారు.