Unstoppable Season 2 Show : ఆహాహా.! బాలయ్య అన్‌స్టాపబుల్ కోసం పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడహో.!
NQ Staff - December 16, 2022 / 01:51 PM IST

Unstoppable Season 2 Show : పవర్ఫుల్ అప్డేట్ వచ్చేసింది. ‘ఆహా’ వేదికగా నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుసుకోబోతున్నారు. ‘త్రివిక్రమ్.. ఎప్పుడొస్తున్నావ్.? వచ్చేటప్పుడు ఎవర్ని తీసుకు రావాలో తెలుసు కదా.?’ అంటూ ‘అన్‌స్టాపబుల్’ వేదిక ద్వారానే ఫోన్లో త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్ విషయమై అల్టిమేటం జారీ చేసేశారు నందమూరి బాలకృష్ణ.
ఎట్టకేలకు త్రివిక్రమ్ చొరవ చూపించాడనీ, పవన్ కళ్యాణ్ ‘ఆహా’ వేదికపై అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా నందమూరి బాలకృష్ణను కలుసుకోబోతున్నాడనీ.. సగటు సినీ అభిమాని మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోలకు చెందిన చాలామంది అనుకోవడంలో వింతేముంది.?
బాలయ్యతో పవన్ కళ్యాణ్.. కానీ, ఎప్పుడు.?
త్వరలో.. అతి త్వరలో.. అంటూ పవర్ఫుల్ అప్డేట్ అయితే ఇచ్చేసింది ‘ఆహా’. కానీ, అదెప్పుడు.? అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇంతకీ, త్రివిక్రమ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’కి వస్తాడా.? లేదంటే, పవన్ కళ్యాణ్ ఒంటరిగానే వస్తాడా.? ఏమో, ప్రస్తుతానికైతే అదంతా సస్పెన్సే. కానీ, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మాత్రం ‘అన్‌స్టాపబుల్’ హిస్టరీలోనే వెరీ వెరీ పవర్ ఫుల్ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.