Pawan Kalyan : ‘ఆదిపురుష్’ సినిమాకు వెళ్లిన వారికి పవన్ స్వాగతం!
NQ Staff - June 4, 2023 / 11:39 PM IST

Pawan Kalyan : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈనెల 16వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆదిపురుష్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో అందరి దృష్టి కూడా సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందా అంటూ జరుగుతున్న చర్చ పై పడింది.
ఆదిపురుష్ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన చిత్రం ‘బ్రో’. పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో నటించిన బ్రో సినిమా యొక్క టీజర్ ను ఆదిపురుష్ సినిమా తో పాటు విడుదల చేయాలని భావిస్తున్నారట.
పవన్ కళ్యాణ్ బ్రో యొక్క టీజర్ విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఆదిపురుష్ సినిమా విడుదల అయ్యే సమయంకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. జులై నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. అందుకే బ్రో యొక్క టీజర్ ఆదిపురుష్ తో వస్తే మంచి మైలేజ్ దక్కడం ఖాయం.