Pawan Kalyan: నిప్పుక‌ణిక‌లాంటి మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌కు వ‌ణుకు పుట్టిస్తున్న జ‌న‌సేనానికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

Pawan Kalyan: ఎప్పుడు వ‌చ్చాం అని కాదు అన్న‌య్య‌, బుల్లెట్ దిగిందా లేదా.. ఈ డైలాగ్ ప‌వన్ క‌ళ్యాణ్‌కి ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చురుకైన ఉత్సాహంతో రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాన్ గ‌త అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్‌లో ఓడిన వెన్ను చూప‌లేదు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. కోట్ల మంది ఇలవేల్పుగా మారిన ప‌వ‌న్ ప‌ద‌వి కోసం కాదు ప్ర‌జ‌ల సేవ కోస‌మే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాన‌ని చెప్పి మ‌రింత మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు.

పవన్‌ ట్రెండ్‌ ఫాలో అవడు. సెట్‌ చేస్తాడు. తన మ్యానరిజంతో అభిమానుల చేత విజిల్‌ కొట్టిస్తాడు.సినిమాల‌లో కాదు బ‌య‌ట కూడా కొన్ని సార్లు త‌న ప్ర‌త్య‌ర్ధుల చేత విజిల్స్ కొట్టించాడు ప‌వ‌న్. పవర్ స్టార్ నటించింది కేవలం 26 సినిమాలే అయినా అశేష ప్రేక్షక అభిమానులన్నీ, తరగని క్రేజీ సంపాదించుకున్నాడు. హిట్లతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్నాడు.

సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ ముందుగా చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో యువరాజ్యం అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో పవన్ సినిమాలే పరిమితమయ్యారు. ఇక 2014కు ముందు రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే జనసేన పార్టీని స్థాపించారు. అయితే నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు.

పవన్ కల్యాణ్ మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలోతాను స‌పోర్ట్ చేసిన పార్టీని ప్ర‌శ్నించాడు. ప్ర‌శ్నించ‌డ‌మే త‌న అజెండాగా ముందుకు సాగాడు. తిత్లీ తుఫాను సమయంలోనూ పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించి బాధితులకు అండగా ఉన్నారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. ఇలా ప్రజా సమస్యలపై జనసేన తరుఫున పోరాడుతూనే ఉన్నారు.

కిందటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసిన ఓటమి పాలవడం ఫ్యాన్స్ తోపాటు తెలుగు ప్రజలందరికీ షాకిచ్చింది. తాను మాత్రం మ‌డ‌మ తిప్ప‌కుండా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ముందుకు సాగుతూ ఉన్నారు. పార్టీ నడిపిందుకు డబ్బులు అవసరం ఉన్నందున మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల‌తో బిజీగా గ‌డుపుతున్న ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న గొప్ప‌త‌నాలు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల‌వుతున్నారు.