Sanusha Santhosh : బంగారంలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

Sanusha Santhosh : పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు ‘సనుష’ కాగ, చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1998లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో ‘బంగారం’ సినిమా తర్వాత అడపాదడపానే సినిమాల్లో కనిపించింది.

TheNewsQube-
Pawan Kalyan Bangaram Movie Child Artist Sanusha Santhosh SH0CKING Transformation
Pawan Kalyan Bangaram Movie Child Artist Sanusha Santhosh SH0CKING Transformation

చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 20కి పైగా సినిమాల్లో నటించింది. అలా ఉత్తమ బాలనటిగా చిన్న వయసులోనే రెండు సార్లు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2012లో మిస్టర్‌ మురుగన్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన సనూషా..ఆ తర్వాత రేణిగుంట, జీనియస్‌ వంటి చిత్రాల్లోనూ నటించింది.

చివరగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్‌ రమ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తుంటుంది.

కొంచెం చూడటానికి బొద్దుగా ఉండే సనుషపై కొందరు ఇన్‌స్టాగ్రాంలో ఈ ఓవర్ వెయిట్‌తో ఫొటోలేంటి, ఆ ఫోజులేంటంటూ విమర్శలు గుప్పించారు. దీంతో.. తనపై వచ్చిన ట్రోల్స్‌పై సనుష ఒకింత ఘాటుగా స్పందించింది. తన బరువు గురించి కామెంట్స్ చేస్తూ కొంతమంది తెగ బాధపడుతున్నారని, ఒక విధంగా చెప్పాలంటే తన కంటే ఎక్కువగా చింతిస్తున్నారని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సానుష..లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో నిరాశ, ఒంటరితనాన్ని ఫీలయ్యానని, ఆ సమయంలో ఎవరికి తెలియకుండా ఓ మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్లు తెలిపింది.