Pawan Kalyan : ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.! ఇదే పవన్ కళ్యాణ్ టైటిలా.?

NQ Staff - December 4, 2022 / 12:07 PM IST

Pawan Kalyan : ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.! ఇదే పవన్ కళ్యాణ్ టైటిలా.?

Pawan Kalyan : పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా కాబోతోందంటూ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని నిర్మించిన నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా ఫ్లాప్ అయినా, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో సత్తా చాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న సినిమా ఇది. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. జపనీస్ అక్షరాలూ పోస్టర్ మీద కనిపిస్తున్నాయి.

సంకేతాలు అవేనా..?

ఆరెంజ్ కలర్ సర్కిల్.. ఎర్రటి రక్తాన్ని తలపించే బ్యాక్‌డ్రాప్.. పవన్ కళ్యాణ్ నీడగా తుపాకీ.. ఇవన్నీ చూస్తోంటే, ఇది పాన్ వరల్డ్ సినిమా అనిపించకమానదు.

‘ఓజీ’ అనేదే టైటిల్ కాబోతోందనీ, పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని రిలీజ్ చేసేందుకే ఈ టైటిల్ వాడే అవకాశం వుందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. జస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిందంతే.. అప్పుడే ఇన్ని రకాల ఊహాగానాలా.? అంటే, పోస్టర్‌ని అంత జాగ్రత్తగా డిజైన్ చేశారు మరి.

కానీ, జనసేన అధినేత వద్ద పాన్ వరల్డ్ స్థాయి సినిమాకి కేటాయించేంత సమయం వుందా.? అన్నదే మిలియన్ డాలర్స్ క్వశ్చన్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us