Pawan-Rana: ఒకే ఫ్రేములో భీమ్లా నాయ‌క్, డానియ‌ల్ శేఖ‌ర్.. పిక్చ‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉందిగా..!

Pawan-Rana: వ‌కీల్ సాబ్ చిత్రం త‌ర్వాత ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్. అయ్యప్పనుమ్ కొషియ‌మ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా అంచనాలను మరో స్థాయికి పెంచుతూ వస్తోంది.

Pawan-Rana

అయ్యప్పనుమ్ కోషియం మూవీ ఆధిపత్యం కోసం ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి ‘భీమ్లా నాయక్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

తాజాగా చిత్రం నుండి క్రేజీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ఒకే ఫ్రేములో క‌నిపించారు.నుల‌క మంచంపై ప‌వన్ ప‌డుకొని ఉండ‌గా, ఎడ్ల బండిపై వైట్ అండ్ వైట్ గెట‌ప్‌లో రానా క‌నిపించాడు. ఈ పోస్టర్ అభిమానుల‌కి పిచ్చెక్కిస్తుంది. మేకింగ్ స్టిల్‌గా ఇది అర్ధ‌మ‌వుతుంది.

ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే భీమ్లా నాయక్ సినిమా పైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఇదివరకే విడుదలైన టీజర్స్ తో క్లారిటీ గా అర్థమైంది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్నఈ సినిమా తెలుగులోను రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని అంటున్నారు.