Pawan Kalyan : బాలయ్యతో పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్.! ట్రోలింగ్ మామూలుగా లేదు.!
NQ Staff - December 28, 2022 / 08:11 AM IST

Pawan Kalyan : నందమూరి బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
సినీ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా.. ‘వైరం’ అయితే ఇరువురి అభిమానుల మధ్యా వుంది. గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద నందమూరి బాలకృష్ణ పొలిటికల్ సెటైర్లు, సినిమాటిక్ సెటైర్లూ వేసిన విషయం విదితమే.
అవన్నీ ఇప్పుడు తెరపైకొస్తున్నాయ్..
నందమూరి బాలకృష్ణకి కొంచెం నోటి దురుసు ఎక్కువ. ఈ క్రమంలో తన స్థాయిని మరిచి, దిగజారుడు వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. వాటిని నెటిజన్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
ప్రధానంగా అటు బాలకృష్ణని వ్యతిరేకించేవారు, ఇటు పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించేవారు.. ఇద్దరూ ఆ పాత వీడియోల్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే, రాజకీయం వేరు.. ఎంటర్టైన్మెంట్ వేరు.. అంటూ బాలయ్య అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులూ సమర్థించుకోవాల్సి వస్తోంది.