Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న అనసూయ ..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఇటీవలే రెండు సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. మొఘలుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 27 వ సినిమా కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ పోస్టర్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకుంది. కాగా రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

pawan-kalyan-anasuya-got-chance-in-his-movie
pawan-kalyan-anasuya-got-chance-in-his-movie

ఇక ఈ సినిమాకి దర్శక, నిర్మాతలు హర హర మహాదేవ్ అన్న హిస్టారికల్ టైటిల్ ని రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కి మాత్రం అందరి నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్విల్న్ ఫెర్నాండస్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. కాని ఇంకా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ..!

ఇది ఇలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలో హాట్ యాంకర్ అండ్ నటి అనసూయ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనుందని లేటెస్ట్ అప్‌డేట్. ఇప్పటికే అనసూయ కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. అలాగే రంగస్థలం, క్షణం లాంటి సినిమాలలో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి కూడా ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేస్తోంది.

Advertisement