Pawan Kalyan: ప‌వన్ క‌ళ్యాణ్ కూడా రీషూట్‌కు వెళుతున్నాడా.. ఏం జ‌రిగింది?

Pawan Kalyan: ఎన్నో ప్ర‌యాస‌ల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు ఒక్కోసారి ఔట్‌పుట్ స‌రిగా రాక‌పోతే వెంట‌నే రీ షూట్‌కి వెళుతుంటారు. ఇటీవ‌ల రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రీషూట్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైంద‌ని ప్ర‌క‌టించిన టీం మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు సంబంధించి కొన్ని ప్ర‌త్యేక స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

pawan kalyan
pawan kalyan

ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కూడా రీ షూట్ కాబోతుందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌కీల్ సాబ్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్ పెట్టిన ప‌వన్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాతో పాటు ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్నారు.

సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతో పాటుగా మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ జరిపిన సీన్స్ లో కొన్నింటిని రీ షూట్ చేయనున్నారని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ప‌వ‌న్ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేసిన ప్రసాద్ మూరెళ్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పనుకున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తెలుగులో ‘భరత్ అనే నేను’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన రవి కె.చంద్రన్ ను తీసుకున్నారట. అయితే ప్రసాద్ మూరెళ్ల ఆధ్వర్యంలో చిత్రీకరించిన సన్నివేశాలను రీ షూట్ చేయాలని చూస్తున్నారట.

ఈ వార్త నిజ‌మైతే మూవీ రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే చాలా రోజుల స‌మ‌యం వేస్ట్ కాగా, మ‌ళ్లీ రీ షూట్‌తో ప‌వ‌న్ ఆ ప్ర‌య‌త్నం చేస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌న్ రానా సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కి.. ‘వీరమల్లు’ 2022 సమ్మర్ కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వీటి త‌ర్వాత ప‌వ‌న్ 28వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.