PAWAN KALYAN : పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్.. హ‌ద్దులు దాటిన ఆనందం

క‌రోనా సెకండ్ వేవ్ సెల‌బ్రిటీల‌ను సైతం వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌రోనా బారిన ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. దీంతో అభిమానులు, సెల‌బ్రిటీలు, జ‌న‌సేప పార్టీ శ్రేణులు కంగారు ప‌డ్డారు. చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న .. పవ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ప‌రిస్థితిని తెలుసుకున్నారు. ఫాం హౌజ్‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చికిత్సను అందించ‌గా, ఈ రోజు ఉద‌యం హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో ప‌వ‌న్ క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించుకున్నార‌ట‌. ఈ ప‌రీక్ష‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నెగెటివ్ అని తేలింద‌ట‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌రోనా నెగెటివ్ రిపోర్ట్ రావ‌డంతో అభిమానులు, జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ రీఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ మంచి హిట్ సాధించిడంతో చాలా సంతోషించిన ప‌వ‌న్ ఫ్యాన్స్ తాజా వార్త‌తో మ‌రింత సంతోషంగా ఉన్నారు. షార్ట్ టైంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోలుకోవ‌డం అభిమానుల‌కు చెప్ప‌లేని ఆనందాన్ని అందిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పాటు.. క్రిష్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Advertisement