VAKEEL SAAB: నాగార్జున సినిమాకు పెంచారు, ప‌వ‌న్‌కు త‌గ్గించారు.. ప్రూఫ్‌తో క‌డిగిపారేస్తున్న మెగా ఫ్యాన్స్

Samsthi 2210 - April 12, 2021 / 11:44 AM IST

VAKEEL SAAB: నాగార్జున సినిమాకు పెంచారు, ప‌వ‌న్‌కు త‌గ్గించారు.. ప్రూఫ్‌తో క‌డిగిపారేస్తున్న మెగా ఫ్యాన్స్

VAKEEL SAAB ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బడా హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే రాజ‌కీయాల వ‌ల‌న కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ప‌వ‌న్ మ‌ళ్లీ వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా చుట్టు రాజ‌కీయ రంగు పులుముకుంది. మొద‌టి రెండు వారాల‌లో అంద‌రు సినిమా హీరోల టిక్కెట్స్ పెంచిన ప్ర‌భుత్వం వ‌కీల్ సాబ్‌కు మాత్రం అనుమ‌తినివ్వ‌డం లేదు. దీంతో చిత్ర బృందం హైకోర్టుని ఆశ్ర‌యించింది. కోర్టు మూడు రోజులు టిక్కెట్స్ పెంచుకోవ్చ‌ని అన్నారు. కాని ఏపీ ప్ర‌భుత్వం మాత్రం వ‌కీల్ సాబ్ చిత్ర విష‌యంలో దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తూ విమర్శ‌లు నెత్తినేసుకుంటుంది.

ఏపిలో ఏప్రిల్ 2న విడుద‌లైన వైల్డ్ డాగ్ చిత్రం, కార్తీ న‌టించిన సుల్తాన్ చిత్రాలకు రేట్స్ పెంచారు. 100 రూపాయల టికెట్ కాస్తా 150 చేసి అమ్ముకున్నారు. వారంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. క‌రోనా వ‌ల‌న బెనిఫిట్ షోస్‌, ప్రీమియ‌ర్ షోస్ ర‌ద్దు చేశాం అంటున్న ప్ర‌భుత్వాలు మిగతా సినిమాల‌కు రేట్స్ పెంచి వ‌కీల్ సాబ్‌కు మాత్రం ఎందుకు అడ్డుక‌ట్ట వేస్తున్నాయి. ఇదంతా రాజ‌కీయ క‌క్ష‌నే కదా అని అభిమానులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికీ టికెట్ బుకింగ్ యాప్‌లో ఒకే థియేట‌ర్లో వ‌కీల్ సాబ్‌కు ఒక రేటు, వైల్డ్ డాగ్‌కు ఒక రేటు ఉండ‌గా, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

గుంటూరులోని నాజ్ థియేట‌ర్లో వైల్డ్ డాగ్ సినిమాకు గోల్డ్ క్లాస్ రేటు 150 రూపాయలు ఉండ‌గా.. అదే థియేట‌ర్లో వ‌కీల్ సాబ్ గోల్డ్ క్లాస్ టికెట్ రేటు 110గా ఉంది. దీనిని చూస్తే అర్దం కావడం లేదా, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కావాల‌నే ఇలా చేస్తుంద‌ని. రాబోయే సినిమాల విష‌యంలోను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇలా క‌చ్చితంగా ఉంటుందా, లేదంటే వ‌కీల్ సాబ్‌పైనే క‌త్తి పెట్టి కూర్చుంటుందా చూడాలి అని విశ్లేష‌కులు అంటున్నారు. ఏదేమైన ఈ ఇష్యూతో వ‌కీల్ సాబ్ చిత్రానికి భారీ ప్ర‌మోష‌న్ ద‌క్కింద‌నే చెప్పాలి. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించగా, అంజ‌లి, నివేదా థామ‌స్, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల‌లో అద్భుతంగా న‌టించారు. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us