PAWAN KALYAN: లాక్‌డౌన్ త‌ర్వాత ప‌వ‌న్ ఫుల్ బిజీ.. ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్‌లో ప‌వ‌ర్ స్టార్

అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ మూడేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌డ‌ని అంతా భావించారు. కాని వ‌కీల్ సాబ్ చిత్రంతో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ మంచి విజ‌యం సాధించాడు. ఇక రానున్న రోజుల‌లో మరిన్ని సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌ సాలిడ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

no updates on pawan kalyan next movies
 

మల‌యాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ తో పాటుగా విలక్షణ దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం చాలా మేర షూట్ జరుపుకుంది. అయితే కొన్నాళ్ల కితం మూడు సినిమాల్లో కూడా ఏకకాలంలో నటించిన పవన్ కోవిడ్ బారిన పడ్డాక వాటన్నిటికీ బ్రేక్ ఇచ్చేసారు. మరి ఇప్పుడు పవన్ మళ్ళీ సన్నద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. వీరమల్లు సహా అయ్యప్పణం రీమేక్ రెండు చిత్రాల్లో కూడా ఒకే సారి షూట్ లో పాల్గొననున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రాలు ఎప్పుడు పూర్తి చేసి వాటిని ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు తెస్తాడా అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.