PAWAN KALYAN: హాస్పిట‌ల్‌లో ప్ర‌త్య‌క్షం అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

PAWAN KALYAN పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌ద్ర‌తా సిబ్బందిలో కొంత మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయ‌న క్వారంటైన్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. క్వారంటైన్‌లో ఉండే ప‌వ‌న్ రాజ‌కీయ కార్య‌క‌లాపాలు చూసుకుంటూ వ‌స్తున్నారు. సినిమాల‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ప్ర‌త్య‌క్షం కావ‌డం, ఆయ‌న‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి వెళ్ల‌గా అక్క‌డ జ‌రిపిన ప‌రీక్ష‌లో లంగ్స్‌లో ఇన్ఫెక్ష‌న్ ఉంద‌ని తేలింద‌ట‌. ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది తలెత్తడంతో.. పవన్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని సమాచారం. క‌రోనా పరీక్ష‌లో మాత్రం ప‌వ‌న్‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని అంటున్నారు. అస‌లు ప‌వ‌న్ ఆరోగ్యం ఎలా ఉంది, త్వ‌ర‌లోనే కోలుకుంటారా అని అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంతో బిజీగా ఉన్నారు.

Advertisement