Pawan: పవన్ కళ్యాణ్- పూరీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న బడా నిర్మాణ సంస్థ..!

Pawan: పవన్ కళ్యాణ్.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. ఆయన అభిమానుల్లో ఓ బ్రాండ్. తెలుగులో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే నిర్మాతలకు పండగే. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. దాదాపు మూడేళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళినా.. పవన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా రిలీజైన వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్. ఏ మాత్రం తగ్గని అభిమానంతో పవన్ కు ఘన స్వాగతం పలికారు.

Pawan Puri

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ సినిమాలో నటిస్తున్నారు. అందులోనూ మల్టీస్టారర్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ లో రానాతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ ఎస్.ఎస్. మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో పాటు పవన్, క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

Pawan Puri

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మంచి హిట్ ను సాధించింది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే అటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, ఇటు పూరీ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓ ప్రముఖ సంస్థ నిర్మిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.