Unstoppable : పవన్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ డేట్ వచ్చేసింది
NQ Staff - January 27, 2023 / 10:16 PM IST

Unstoppable : పవన్ కళ్యాణ్ అటెండ్ అయిన బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజన్ 2 షూటింగ్ జరిగి చాలా రోజులు అయ్యింది. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 3వ తారీకున ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
రెండు ఎపిసోడ్స్ గా పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్ ను విభజించారని తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ ను ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో లో పవన్ మరియు బాలయ్య లు చాలా సరదాగా ఎపిసోడ్ ను ముందుకు తీసుకు వెళ్లినట్లుగా ప్రోమోను బట్టి అర్థం అవుతుంది.
హీరోగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మొదలుకుని.. హీరోగా ఎంట్రీ ఇలా ఇచ్చాడు.. మరియు మూడు పెళ్లిల విషయం ఇలా అన్ని విషయాలకు సంబంధించిన విషయాలను పవన్ కళ్యాణ్ నుండి బాలకృష్ణ అడిగి ప్రేక్షకుల యొక్క అనుమానాలకు సమాధానం ఇచ్చాడు.
వీరిద్దరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో లో చాలా విషయాలను దాచారు. ఎపిసోడ్ చూసే విధంగా అందరికి కూడా ఇంట్రెస్ట్ కలిగించారు అనడంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ లో సాయి ధరమ్ తేజ్ కూడా హాజరు కాబోతున్నాడు. అంతే కాకుండా రామ్ చరణ్ కూడా ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాడు. మొత్తానికి సరదాగా ఈ ఎపిసోడ్ సాగబోతుందని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది.