Pathaan Movie Review : షారుఖ్ పఠాన్ మూవీ రివ్యూ..!
NQ Staff - January 25, 2023 / 12:23 PM IST

Pathaan Movie Review : ఒకప్పుడు బాలీవుడ్‌ను తన కనుసైగలతో ఏలిన కింగ్ ఖాన్ షారుఖ్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేండ్లు అవుతోంది. ఆయన హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఈ క్రమంలోనే ఆయన నుంచి పఠాన్ మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా గణతంత్ర వేడుకల సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ ఏంటంటే..
ఇది చాలా రొటీన్ కథ. ఇండియా మీద విలన్లు పెద్ద ఎత్తున బాంబుల కుట్ర చేస్తుంటారు. దాంతో హీరో షారుఖ్ ను రంగంలోకి దింపుతారు. ఇందులో విలన్ అయిన జాన్ అబ్రహాంను షారుఖ్ ఎలా పట్టుకున్నాడు, ఈ క్రమంలోనే ఆయనకు దీపికా పదుకొణెతో పరిచయం, ప్రేమ, ఆమె హెల్ప్ తదితర విషయాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. వీటన్నింటినీ బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
షారుఖ్ ఖాన్ గురించి అందరికీ బాగా తెలుసు. ఆయనకు కరెక్ట్ రోల్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో ఈ సినిమాలో మరోసారి నిరూపించాడు. ఇందులో కథ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా యాక్షన్ సీన్సలో షారుఖ్ విశ్వరూపాన్ని చూపించాడు. కొన్నేండ్లుగా షారుఖ్ ను ఎలా చూడాలని ప్రేక్షకులు ఆరాట పడుతున్నారో ఈ సినిమా అలాగే ఉంది. ఇక దీపికా కూడా యాక్షన్ సీన్లలో గ్లామర్ పరంగా బాగా ఆకట్టుకుంది. జాన్ అబ్రహం విలనిజం కూడా ఆకట్టుకుంటుంది.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..

Pathaan Movie Review
ఈ మూవీ సిద్దార్థ్ ఆనంద్ పూర్తిగా యాక్షన్ సీన్ల నేపథ్యంలోనే తీశాడు. అంతే తప్ప కథ గురించి అస్పలు పట్టించుకోలేదు. ఈ సినిమాను చూస్తే గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, వార్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కాకపోతే ఇందులో యాక్షన్ సీన్లను కొత్తగా తెరకెక్కించడంలో ఆనంద్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇందులో యాక్షన్ సీన్లలో టేకింగ్ వేరే లెవల్ ఉంది. ఇక మ్యూజిక్ కూడా బాగానే ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
ప్లస్ పాయింట్లు..
యాక్షన్ సీన్లు
షారుఖ్ ఖాన్..
దీపికా పదుకొణె గ్లామర్
మైనస్ పాయింట్లు..
కథలో బలం లేకపోవడం
ఫస్ట్ హాప్ లో సాగదీత
చివరగా..
ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. కానీ షారుఖ్ ఖాన్ యాక్షన్ సీన్ల కోసం సినిమాను చూడొచ్చు. ఇందులో గ్రాఫిక్స్ లో కొన్ని చోట్ల మైనస్ పాయింట్లు ఉన్నా సరే షారుఖ్ నటనతో అవన్ని కవర్ అయిపోతాయి. షారుఖ్ లాస్ట్ మూవీస్ అన్నింటిలో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. యాక్షన్ సీన్లలో ఇది బాగుంది.
రేటింగ్: 2.75