MAHESH BABU సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలోనే మంచి హీరోగా ఎదిగాడు. పోకిరి చిత్రం తర్వాత మాస్ హీరోగా ఎదిగిన మహేష్ కొన్నాళ్ళుగా సోషల్ మేసేజ్ నేపథ్యంలో సినిమాలు చేస్తున్నాడు. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి సందేశాత్మక చిత్రాలు కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్న మహేష్ ఈ సినిమాని కూడా సోషల్ మెసేజ్ నేపథ్యంలోనే చేస్తున్నాడు.
పరశురాంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అనే చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ దుబాయ్ లో పూర్తి కాగా, మిగతా షెడ్యూల్స్‌ని గోవా, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో జరపడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే సంక్రాంతికి విడుదల కానున్న మహేష్ సినిమాకి తెలుగుతో పాటు ఇతర భాషలలోను మంచి క్రేజ్ ఏర్పడింది. మహేష్‌కు సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్‌గా మారిపోతున్నారు తాజాగా బాలీవుడ్ భామ పరిణితి చోప్రా కూడా మహేష్ అంటే పడిచచ్చిపోతుంది. ఆయనతో వర్క్ చేయాలని కలలు కంటుంది.
పరిణితి ప్రస్తుతం “ది గర్ల్ బిహైండ్ ఆన్ ది ట్రైన్” అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ గురించి నోరు విప్పింది. మహేష్ లుక్స్ అంటే తనకు ఇష్టమని చెప్పిన పరిణితో చోప్రా వీలుంటే అతనితో సినిమా చేస్తానంటుంది. తెలుగు రాకపోయిన సరే మహేష్‌తో సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పరిణితి చెప్పిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. గత వారం జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో మిగతా అభిమానులు హర్ట్ అవుతున్నారు. కాగా, పరిణితి .. సైనా నెహ్వాల్ బయోపిక్‌లోను నటిస్తున్న విషయం తెలిసిందే.