PARINEETI CHOPRA: విమ‌ర్శ‌లతో విసిగిపోయానంటున్న అందాల ముద్దుగుమ్మ‌

సినీ సెల‌బ్రిటీల‌కు విమ‌ర్శ‌లు కొత్త కాదు. ఛాన్స్ దొరికితే ఏదో ఒక వంక చూపించి ప్ర‌ముఖుల‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అయితే కొద్ది రోజులుగా ప‌రిణీతి చోప్రా ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. కెరీర్ ను రైజింగ్ గానే ప్రారంభించి కొన్ని హిట్ లను అందుకున్న‌ప్ప‌టికీ, బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడంతో సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించలేక చతికిలబడింది. అయితే గత రెండు నెలల్లో పరిణీతి నటించిన మూడు చిత్రాలు ప్రశంసలను అందుకున్నాయి. తన నటనకు మంచి పేరొచ్చింది. కాక‌పోతే ప‌రిణితీపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో ఆమె తెగ విసిగిపోయింది.

నువ్వు నీ బెస్ట్ ఇవ్వలేదు! అని ప్రజలు పదే పదే అడుగుతుంటే వినీ వినీ విసిగిపోయానని.. నీరసించానని ప‌రిణితీ చోప్రా ఆవేదన చెందింది. పరిణీతి కెరీర్ లో ఫ్లాప్ ల వాటా పెద్దదే అయినా ఇటీవల నెమ్మదిగా కోలుకుంటోంది. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రంలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు `సందీప్ P ర్ పింకీ ఫరార్` చిత్రంలో నటనకు మంచి సమీక్షలను అందుకుంటోంది. ఎప్పుడు నా వంతు కృషి చేస్తాను. ఎంచుకున్న ప్రాజెక్టులు నా నటనా సామర్థ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించడానికి అవకాశం కల్పించేవి కావని పారీ అన్నారు. నిరూపించుకునేందుకు స్కోప్ లేదని తెలిపారు.