Pareshan Movie Review : పరేషాన్ మూవీ రివ్యూ..!
NQ Staff - June 2, 2023 / 09:04 AM IST

Pareshan Movie Review : ఈ నడుమ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో చాలానే సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన బలగం, దసరా, మేమ్ ఫేమస్ మంచి హిట్ అయ్యాయి. దాంతో తెలంగాణ కల్చర్ నేపథ్యంలో సినిమాలు పెరుగుతున్నాయి. తాజాగా వచ్చిన పరేషాన్ మూవీ కూడా ఇలాంటిదే. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మసూద సినిమా ఫేమ్ తిరువీర్ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. అయితే హీరో దగ్గుబాటి రానా సమర్పణలో వస్తుండటంతో మూవీ ప్రమోషన్స్ బాగా చేశారు. దాంతో మూవీపై అంచనాలు పెరిగాయి. నేడు థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే..
ఐజాక్(తిరువీర్) ఐటీఐ ఫెయిల్ అయి జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, గొడవలు, పార్టీలు ఇలా ఉంటాడు. అయితే ఆయన తండ్రి తాను పని చేస్తున్న సింగరేణి జాబ్ ను తన కొడుక్కు పెట్టించాలని చూస్తాడు. ఇందుకోసం తన భార్య గాజులు, నగలు అమ్మి పైరవీ చేయించాలని డబ్బులు తీసుకొస్తాడు. కానీ ఈ డబ్బులను ఐజాక్ తన ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడని అతనికి ఇచ్చేస్తాడు. డబ్బులు ఏం చేశావని రోజూ ఇంట్లో గొడవ. ఈ క్రమంలోనే తన లవర్ శిరీష(పావని కరణం)తో ఒక్కసారి కలవడంతో గర్భవతి అవుతుంది. ఆమెకు అబార్షన్ చేయించాలని డబ్బులు రెడీ చేస్తే ఓ ఫ్రెండ్ కొట్టేస్తాడు. కానీ ఎవరు కొట్టేశారో ఐజాక్ కు తెలియదు. మరి ఆయనకు డబ్బులు సమకూరాయా, తన డబ్బులను ఎవరు కొట్టేశారు, అబార్షన్ చేయించాడా చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఐజాక్ పాత్రలో తిరువీర్ అదరగొట్టేశాడు. చాలా నేచురల్ యాక్టింగ్ ను కనబరిచాడు. తాగుబోతుగా, కామెడీ సీన్లలో, ఫ్రస్ట్రేటెడ్ బాయ్ గా ఇలా అన్ని కోణాలు చూపించాడు. ఇక అతని ఫ్రెండ్స్ గా ఉన్న ఆర్జీవీ పాత్ర, మైదాక్, సత్తి(అర్జున్ కృష్ణ) వీళ్లంతా చాలా సహజంగా నటించారు. వీరందరూ పడే బాధలు కామెడీని పంచుతాయి. ఇక శిరీష పాత్రలో పావని కూడా బాగానే నటించింది. మిగతా పాత్ర దారులు బాగానే ఆకట్టుకున్నారు.
టెక్నికల్ పనితీరు..
ఈ సినిమాను పూర్తిగా డైరెక్టర్ తన కంట్రోల్ లోనే పెట్టుకోవాలని అనుకున్నారు. కమర్షియల్ మూవీగా కాకుండా పారలల్ మూవీగా తెరకెక్కించాలని చూశారు. సినిమాను హద్దులు దాటేసి ఎలా అయినా చూపించవచ్చు అని నిరూపించాడు. కానీ కొన్ని సీన్లలో ఆయనకు నచ్చింది మాత్రమే తీశారు తప్ప ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది ఆలోచించలేదు. అదే మైనస్ గా మారిపోయింది. సీన్లు మరింత క్వాలిటీగా తీసుకుంటే బాగుండేది. వాసు పెండమ్ కెమెరా పనితనం బాగుంది. యశ్వంత్ నాగ్ సంగీతం ఉన్నంతలో పర్వాలేదు. బీజీఎం పెద్దగా ఆకట్టుకోలేదు.

Pareshan Movie Review
ప్లస్ పాయింట్లు..
నటీనటుల పర్ఫార్మెన్స్
కొన్ని కామెడీ సీన్లు
మైనస్ పాయింట్లు…
సీన్లు క్వాలిటీగా లేకపోవడం
కంటెంట్ లో లోపాలు
ఆకట్టుకోని మ్యూజిక్
చివరగా..
పరేషాన్ మూవీ ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. అందులోని ఫన్ ఎంజాయ్ చేసేలా ఉంది. కానీ చాలా సీన్లు బోరింగ్ గా అనిపిస్తాయి. శృతిమించిన తాగుడు చెండాలంగా అనిపిస్తుంది. కంటెంట్ లో కూడా బలమైన కారణాలు లేవు. ఒక సీన్ ఎందుకు వస్తుందో లాజిక్ లేకుండా సినిమా తీశారు. పెద్దగా ఆకట్టుకోదనే చెప్పుకోవాలి.
రేటింగ్ః2.25/5