SWATHI: క‌ల‌ర్స్ స్వాతి రీ ఎంట్రీ.. స‌రికొత్త పాత్ర‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం

ఒక‌ప్పుడు బుల్లితెర‌పై పసందైన వినోదాన్ని అందించిన క‌లర్స్ స్వాతి త‌ర్వాత వెండితెర‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన ఈ ముద్దుగుమ్మ రామ్ గోపాల్ వ‌ర్మ‌, కృష్ణ వంశీ లాంటి ద‌ర్శ‌కుల‌తో కూడా ప‌ని చేసింది. తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన స్వాతి పెళ్లి త‌ర్వాత కాస్త సినిమాలు త‌గ్గించింది.ఇప్పుడు పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి.

కొత్త ద‌ర్శ‌కుడు పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో పంచ‌తంత్రం సినిమా రూపొందుతుండ‌గా, తాజాగా సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేశారు. సీనియర్ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, సముద్రకని లాంటి స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ చిన్న కూతురు, దొరసాని ఫేమ్ శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద తదితరులు పంచతంత్రం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు పోస్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ప్రతి జీవికి అవసరమైన రంగు రుచి వాసన స్పర్శ వినికిడి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఈ చిత్ర క‌థ తిరిగుతుంద‌ట‌. కలర్ ఫోటో సినిమాని తెరకెక్కించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు మాటలు రాస్తుండటం విశేషం. ఆరేళ్ల త‌ర్వాత స్వాతి చేస్తున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో చూడాలి.

Advertisement