Pallavi Prashant Life Story : అవమానాలు దాటుకుని బిగ్ బాస్ లోకి రైతు బిడ్డ.. ఎవరీ పల్లవి ప్రశాంత్..?

NQ Staff - September 4, 2023 / 11:18 AM IST

Pallavi Prashant Life Story : అవమానాలు దాటుకుని బిగ్ బాస్ లోకి రైతు బిడ్డ.. ఎవరీ పల్లవి ప్రశాంత్..?

Pallavi Prashant Life Story : తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సీజన్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశ, విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాల్టీ షో.. ఇప్పుడు ఏడో సీజన్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఆరు సీజన్లు, ఓ ఓటీటీ సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే గత ఆరో సీజన్ దారుణంగా అట్టర్ ప్లాప్ అయింది. అందుకే ఈ ఏడో సీజన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక హోస్ట్ గా నాగార్జున మారుతారిన అనుకుంటే.. మళ్లీ ఆయనే హోస్ట్ గా చేస్తున్నారు. అయితే ఏడో సీజన్ లో చాలా ప్రత్యేకమైన వారిని హౌస్ లోకి తీసుకువచ్చారు.

ఇందులో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. ఇలా ఒక రైతును ఇండియాలో ఏ భాషలో కూడా బిగ్ బాస్ లోకి తీసుకురాలేదు. ఇదే మొదటి సారి. ఇతను కామన్ మ్యాన్ కోటాలనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేస్తూ పల్లవి ప్రశాంత్ ఫేమస్ అయ్యాడు. దాంతో ఆయన వీడియోలు బాగా వెళ్లడంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. గత మూడు సీజన్ల నుంచి తనను బిగ్ బాస్ లోకి తీసుకోవాలని అతను కోరుతున్నాడు. అందుకే ఆయన్ను ఈ సీజన్ కు తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ తెలిస్తే కన్నీళ్లు రావాల్సిందే.

ప్రశాంత్ చదువుకున్నాడు. కానీ వ్యవసాయం మీద మక్కువతో పొలం పనులు చేస్తూ జీవిస్తున్నాడు. నీ కొడుకు ఏంటి వ్యవసాయం చేస్తున్నాడు అని చాలామంది అవమానించిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రశాంత్ తనకు నచ్చిన పనినే ఎంచుకున్నాడు. ఒక రైతు బాధ ఏంటో రైతు కొడుకుకు మాత్రమే అర్థం అవుతుందని ప్రశాంత్ బిగ్ బాస్ వేదికపై చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. ఏ జాబ్ చేసినా ఒకరి కింద బతకడమే. అదే వ్యవసాయం చేస్తే.. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ ఇంకో నలుగురి కడుపు నింపుతాం అంటూ చెబుతున్నాడు ప్రశాంత్.

తనకు సంబంధించిన మరో విషయం కూడా చెప్పాడు. నేను గతంలో ఓ జానపద గీతం చేశాను. దాని ద్వారా రూ.4 లక్షలు వచ్చాయి. కానీ నా స్నేహితులు మోసం చేశారు. ఆ తర్వాత కూడా చాలా అవమానాలు భరించాను. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అని అంటుంటే మా నాన్న చాలా గర్వపడుతున్నారు. నాకు అది చాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ఇక బిగ్ బాస్ వేదిక మీదకు వెరైటీగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్.

తాను పండించిన బియ్యం బస్తాని నాగార్జునకి గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రశాంత్. అంతే కాకుండా తన పొలంలోని మట్టిని కూడా తెచ్చి ఇచ్చాడు. ఇక ప్రశాంత్ కి నాగార్జున ఒక మిర్చి మొక్కని గిఫ్ట్ గా ఇచ్చాడు. హౌస్ లో దాన్ని జాగ్రత్తగా కాపాడాలని చెప్పాడు. ఆ మొక్క మిర్చీ కాస్తే మంచి బెనిఫిట్స్ ఇస్తానని నాగార్జున హామీ ఇచ్చాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us