Pallavi Prashant Assets Value : రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆస్తులు ఎంతో తెలుసా.. సెలబ్రిటీల సపోర్ట్ అందుకేనట..!

NQ Staff - September 18, 2023 / 11:00 AM IST

Pallavi Prashant Assets Value : రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆస్తులు ఎంతో తెలుసా.. సెలబ్రిటీల సపోర్ట్ అందుకేనట..!

Pallavi Prashant Assets Value :

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. మొన్నటి వరకు కేవలం యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ యూజర్లకు మాత్రమే ఈ పేరు తెలుసు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని మనోడి పేరు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసిపోయింది. దాంతో ఇప్పుడు మనోడు కూడా సెలబ్రిటీ అయిపోయాడు సామాన్య రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కు రోజు రోజుకూ సపోర్ట్ ఓ రేంజ్ లో దొరుకుతోంది. రైతుబిడ్డ సెంటిమెంట్ మనోడికి బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. పైగా అందరూ కలిసి మానోడిని టార్గెట్ చేయడం వల్ల మనోడికి ఇంకాస్త సింపతీ పెరిగింది.

హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడం మనోడికే ప్లస్ అయింది. దెబ్బకు వోటింగ్ లో అందరికంటే టాప్ లో ఉంటున్నాడు. ఇప్పటికే ఇతనికి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో ఇతని మీదట్రోల్స్ కూడా బాగా వస్తున్నాయి. నెగెటివిటీ కూడా బాగా పెరిగిపోతోంది. ఎంత నెగెటివిటీ వచ్చినా సరే ఓటింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అయితే పల్లవి ప్రశాంత్ కు ఇప్పుడు సెలబ్రిటీల సపోర్ట్ కూడా బాగా లభిస్తోంది. అఖిల్ సార్థక్ లాంటి వారు కూడా ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పల్లవి ప్రశాంత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆస్తుల చిట్టా ఏంటనే విషయాలు వైరల్ అవుతున్నాయి.

పల్లవి ప్రశాంత్ సామాన్య రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. పేరుకు మనోడు రైతుబిడ్డనే. కానీ మనోడికి ఏకంగా 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఓ ట్రాక్టర్ కూడా ఉంది. అంతే కాకుండా రైతుబిడ్డ పేరుతో సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదించాడు. దాంతో పాటు కొందరు రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉందంట. ఎందుకంటే వారికి ప్రశంత్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రమోషన్ చేయించాడు. అంతే కాకుండా చాలా మంది షాప్ ఓపెనింగ్ లకు వెళ్లి వారికి ప్రమోషన్ చేయించాడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా.

అందుకే కొందరు రాజకీయ నేతలు, యువ నాయకులు ప్రశాంత్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో దగడ్ సాయి లాంటి వారు అంతే కాకుండా ఒకందరు ఫోక్ సాంగ్స్ పాడే సింగర్లు, ఇతర ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానెళ్లు మనోడి కోసం పని చేస్తున్నాయి. ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే ప్రశాంత్ కు అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. పైగా రైతుబిడ్డ అనే కాన్సెప్ట్ బాగా పని చేస్తోంది.

ఇవన్నీ వెరసి ప్రశాంత్ కు అందరికంటే టాప్ రేంజ్ లో ఓట్లు పడేలా చేస్తున్నాయి. చూస్తుంటే బిగ్ బాస్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అనిపిస్తోంది. ప్రశాంత్ క్రేజ్ చూస్తుంటే ఫైనల్ కు వెళ్లడం ఖాయం అనిపిస్తోంది. మరి అక్కడ వరకు వెళ్లాక కప్ కోసం ఇంకాస్త కష్టపడితే మాత్రం మనోడికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us