Sehar Shinwari : భారతీయ మహిళలపై పాకిస్తానీ నటి సెహర్ షిన్వారీ వివాదాస్పద వ్యాఖ్యలు.!
NQ Staff - January 10, 2023 / 05:07 PM IST

Sehar Shinwari : భారతీయ మహిళల్లో ఎవరికీ బ్రెయిన్ లేదంటూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్తానీ నటి సెహర్ షిన్వారీ. ఈ మధ్యకాలంలో భారతీయుల్ని టార్గెట్గా చేసుకుని సెహర్ షిన్వారీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు, ఆమెకు పాకిస్తాన్లో బోల్డంత పాపులారిటీ తెచ్చిపెడుతున్నాయి.
ఎవరీ సెహర్ షిన్వారీ.. అని ఇండియాలో కూడా ఈమె గురించి ఒకింత ఏహ్య భావంతో కూడిన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.
భారతీయులకి అందుకే నేనంటే జెలసీ..
ఇండియాలో ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ వున్నవాళ్ళు పుట్టలేదు.. అందుకే, వాళ్ళకి నేనంటే జెలసీ.. అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది తాజాగా సెహర్ షిన్వారీ.
‘అయితే, ప్రియాంకా చోప్రా గ్లోబల్ హీరోయిన్.. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది.. మరి, మీ పాకిస్తాన్ నుంచి అలాంటోళ్ళు ఎవరున్నారు.?’ అని ప్రశ్నిస్తున్నారు భారతీయ నెటిజన్లు.
‘మా సినిమాలు ప్రపంచ సినిమాకి సవాల్ విసురుతున్నాయి.. వాటిని మీరు డబ్ చేసుకుంటున్నారు.. మేం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాం.. మీరేమో అడుక్కు తింటున్నారు..’ అంటూ సెహర్ షిన్వారీ మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.