Pakija : తిండిలేని దీన స్థితిలో ‘పెదరాయుడు’ పాకీజా

NQ Staff - January 11, 2023 / 05:44 AM IST

Pakija : తిండిలేని దీన స్థితిలో ‘పెదరాయుడు’ పాకీజా

Pakija : మోహన్‌ బాబు మరియు రజినీకాంత్ లు నటించిన పెద రాయుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చి పోరు. అప్పటి ప్రేక్షకులు పెద రాయుడు ను థియేటర్ల ద్వారా చూడగా.. ఇప్పటి ప్రేక్షకులు ఇప్పటికి కూడా టీవీల్లో పెద రాయుడు సినిమాను చూస్తున్నారు.

ఆ సినిమాలో కామెడీ ట్రాక్ లో నటించిన పాకీజా ఇప్పటికి కూడా ఎంతో మందికి గుర్తు. పాకీజా అనగానే ఒక రకమైన ఫీల్ కలిగేంతగా ఆమె ఆ సినిమాలో నటించి మెప్పించింది. అందుకే ఆమెకు చాలా మంది అభిమానులు అయ్యారు అనడంలో సందేహం లేదు.

తమిళంలో పదుల కొద్ద సినిమాల్లో నటించిన పాకీజా ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. ఈమె చేసే ఏ ఒక్క సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై లేదు. ఏదో మారు మూల ప్రాంతంలో ఈమె జీవనంను సాగిస్తున్నారు.

ఇటీవల చెన్నైలో జయలలిత ను చూసేందుకు పాకీజ కనిపించారు. బస్సు ఎక్కేందుకు బస్ స్టాండ్‌ లో వెయిట్‌ చేస్తున్న పాకీజా ను జర్నలిస్ట్ కలిసి ఆమెను మాట్లాడించగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఆ జర్నలిస్ట్‌ భోజనం పెట్టిస్తే ఇంత మంచి భోజనం తిని చాలా సంవత్సరాలు అయ్యిందని కన్నీళ్లు పెట్టుకుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు ఎంతో మందిని ఆమె సాయం కోసం చేతులు చాచి ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us