Paisa Paramathma : సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘పైసా పరమాత్మ’ చిత్రం మార్చి 12న విడుదల.!!!

Paisa Paramathma: కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం ‘పైసా పరమాత్మ‘ . సాంకేత్,సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిర‌ణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్ కాగా ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసుకుని మార్చి 12 న విడుదల సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత టి.కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ.. పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. దర్శకుడు కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సినిమా చేశాడు. అయన మీద నమ్మకంతోనే ఈ సినిమా ని పూర్తి చేయగలిగాము.. ఈ సినిమా కి మొదటినుంచి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా సినిమా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి మమ్మల్ని ఆశీర్వదించిన రాజ్ కందుకూరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరు సినిమా ను ఆదరించండి అని అన్నారు.

సాంకేతిక విభాగం : Paisa Paramathma

బ్యానర్ : ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్
మ్యూజిక్ : కనిష్క్
దర్శకుడు : విజయ్ కిర‌ణ్ తిరుమల
నిర్మాత : టి.కిర‌ణ్ కుమార్

Advertisement
Advertisement