Padma Awards : మన నాటు నాటు కీరవాణికి పద్మ పురష్కారం
NQ Staff - January 25, 2023 / 10:20 PM IST

Padma Awards : కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన విశేష సేవలు అందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాదికి గాను మొత్తం 106 మంది కి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరుగురిని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కి ఎంపిక చేయగా, తొమ్మిది మందిని పద్మభూషణ్ కి, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలను ఎంపిక చేయడం జరిగింది.
తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 12 మందికి పద్మ పురస్కారాలు వరించాయి. ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామికి పద్మ అవార్డు లభించింది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా పద్మ అవార్డు లభించింది.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాటకు గాను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది.