PAAGAL: పాగ‌ల్ అట్టర్ ఫ్లాప్: హీరో చెప్పిన మాట‌ల‌న్నీ గాలి మాట‌లే అయ్యాయి

PAAGAL: మాస్ కా దాస్ ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్‌గా పాగ‌ల్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. న‌రేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. రధన్ సంగీతం అందించారు.


PAAGAL Movie Review
PAAGAL Movie Review


ఆగ‌స్ట్ 14న విడుద‌లైన ఈ చిత్రంకి మంచి టాక్ వ‌చ్చిన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ‘పాగల్’ చిత్రానికి రూ.6.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.6.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండ‌గా, ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.5.09 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.1.4 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు స్పష్టమవుతుంది.


పాగ‌ల్ చిత్రం నైజాం 2.13 cr, సీడెడ్ 0.85 cr, ఉత్తరాంధ్ర 0.61 cr, ఈస్ట్ 0.29 cr, వెస్ట్ 0.18 cr, గుంటూరు 0.33 cr, కృష్ణా 0.19 cr, నెల్లూరు 0.14 cr, ఏపీ + తెలంగాణ (టోటల్) 4.72 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.37 Cr, వరల్డ్ వైడ్ టోటల్ 5.09 Cr వ‌సూళ్లు రాబ‌ట్టింది.


పాగల్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో ‘సినిమా కచ్చితంగా సక్సెస్‌ అవుతుంది. లేదంటే పేరు మార్చుకుంటా’ అని చెప్పాడు విశ్వ‌క్ సేన్. మ‌రి తాజా లెక్క‌ల‌ని చూస్తే పాగ‌ల్ ఫ్లాప్ అయిన‌ట్టే కదా, మ‌న హీరో పేరు మార్చుకుంటాడా, దీనిపై ఏమంటాడు అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.


స‌క్సెస్ టాక్ వ‌చ్చాక మీడియాతో మాట్లాడిన విశ్వ‌క్ సేన్ .. ‘‘ఈ సినిమా విడుదల తర్వాత చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని ఎదురు చూశారు. కానీ, ప్రేక్షకులు విజయాన్ని అందించి ఆ అవసరం లేకుండా చేశారు. అప్పుడే నాకర్థమైంది.. నాకు మీరు తప్ప ఎవరూ మరెవరూ లేరని. నన్ను కాపాడేది మీరేనని అన్నారు.