Naga Chaitanya : స‌మంత క‌న్నా ముందు చైతూ లైఫ్‌లో ఆ హీరోయిన్ ఉండేనా?

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ కపుల్స్‌లో నాగ చైత‌న్య స‌మంత జంట ఉండేవారు. ఏమైందో ఏమో గాని అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్నారు. వీరిద్ద‌రి విడాకుల త‌ర్వాత అనేక విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సమంత కాకుండా ముందుగా నాగ చైతన్య ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.

other heroine in Naga Chaitanya life before samantha 1
other heroine in Naga Chaitanya life before samantha

సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరగుతాయో.. విడాకులు కూడా అంతే జెడ్ స్పీడ్‌లో జరిగిపోతుంటాయి. ఈ కోవలోనే అందమైన అద్భుతమైన జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. విడాకులు ప్రకటన అనంతరం ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయ్యారు.

other heroine in Naga Chaitanya life before samantha
other heroine in Naga Chaitanya life before samantha

నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత మీద సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడిచింది. ముఖ్యంగా చై పుట్టిన రోజు నాడు సమంత అతడికి శుభాకాంక్షలు చెప్పలేదు.. పైగా తన పెంపుడు కుక్కకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలపడంతో నెటిజన్లు సామ్‌ మీద ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

నాగచైతన్యకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. సమంత కన్నా ముందు చై.. ఓ స్టార్‌ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరీ ఏం జరిగిందో తెలియదు కానీ వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదనేది వార్త సారంశం. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరంటే.. విలక్షణ నటడు కమల్‌హాసన్‌ కుమార్తె శ్రుతి హాసన్‌ అట.

చై, శ్రుతి హాసన్‌లకు 2013లో పరిచయం ఏర్పడింది. ఇక సమంతను పెళ్లి చేసుకోకముందు అనగా.. 2017లో చై, శ్రుతి హాసన్‌తో డేటింగ్‌ చేశాడట. శ్రుతి, చైతన్యల మధ్య సిరీయస్‌ రిలేషన్‌ కొనసాగిందని.. ఒకానొక సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారట. ఏం జరిగిందో తెలియదరు ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారట. వీరద్దరూ కలిసి 2018లో విడుదలైన ప్రేమమ్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.