Oscars 2022: ఆస్కార్‌లో నిరాశ‌.. బ‌రిలో త‌మిళం, మ‌ల‌యాళ సినిమాలు

Oscars 2022: సినిమా అవార్డ్స్‌లో చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డులు ద‌క్కించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క క‌ళాకారుడు ఆరాట‌ప‌డుతుంటాడు. ఆస్కార్ అనేది మ‌న వాళ్ల‌కు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఈ సారి కూడా తెలుగు సినిమాలు ఆస్కార్‌కి వెళ్లే అవ‌కాశం ద‌క్కించుకోలేదు. తమిళం మరియు మలయాళం నుండి ఈసారి రెండు సినిమాలు వెళ్లాయి.

TheNewsQube-

Oscars 2022

తమిళం నుండి మండేలా సినిమాను ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ కు ఎంపిక చేయడం జరిగింది. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు నటించిన మండేలా సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆలోపించజేసే విధంగా సాగింది. అందుకే మండేలాకు ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఛాన్స్ దక్కింది.

ఇక మలయాళం నుండి నయట్టు అనే ఒక చిన్న సినిమాకు ఛాన్స్ దక్కింది. ఈ రెండు సినిమాలను తెలుగు లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇక బాలీవుడ్ నుండి విద్యాబాల‌న్ షేర్ని, విక్కీ కౌశల్ స‌ర్ధార్ ఉద్ధం చిత్రాలు షార్ట్ లిస్ట్‌లో ఎంపిక కాబ‌డ్డాయి.

ప్రతి ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల ఎంట్రీ కోసం ఇండియన్ సినిమాలు కొన్ని పోటీ పడుతాయి.. అందులో తెలుగు సినిమాలు మాత్రం ఉండటం లేదు. తెలుగు సినిమాలు కేవలం వసూళ్ల పరంగా మాత్రమే రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి కాని ఆస్కార్ ఎంట్రీ కి కూడా పనికి రావడం లేదు అంటూ సినీ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మ‌నిషి, జంతువుల మ‌ధ్య నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ తాలూకు క‌థాంశంతో తెర‌కెక్కిన షేర్ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇందులో న‌ట‌న‌కుగాను విద్యా బాల‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇక షూజిత్ సిర్కార్ తెర‌కెక్కించిన స‌ర్దార్ ఉధ‌మ్ కూడా పాజిటివ్ రీవ్యూల‌ను సొంతం చేసుకుంది. ఇందులో విప్ల‌వ‌కారుడు స‌ర్దార్ ఉధ‌మ్ సింగ్ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్ మెప్పించాడు.