Kangana Ranaut : కంగనాపై మ‌రో కేసు.. రైతు ఉద్య‌మంపై ఇలాంటి కామెంట్స్ చేసిందేంటి…!

Kangana Ranaut : బాలీవుడ్ హాట్ బాంబ్ కంగనా ర‌నౌత్ నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఒక్కసారిగా రెచ్చిపోయింది.

one more case on kangana ranaut
one more case on kangana ranaut

కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సైతం తన గళం వినిపించింది. అంతటితో ఆగకుండా వరుసగా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజు.. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగకుండా జాతిపిత మహాత్మా గాంధీపైన కూడా పలు వ్యాఖ్యలు చేసింది.

one more case on kangana ranaut
one more case on kangana ranaut

తాజాగా కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడంపై మహరాష్ట్ర ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న కాళిస్తానీలతో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. ఇది నచ్చని సిక్ మతస్థులు తనపై కేసు నమోదు చేయించారు. పలువురు సిక్ మత పెద్దలు కలిసి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతకు ముందు కూడా సాగు చట్టాల రద్దు సరికాదు అంటూ కామెంట్స్ చేసింది కంగనా.అస‌లే ముంబై రాష్ట్ర ప్ర‌భుత్వం కంగ‌నా ర‌నౌత్‌కు వ్య‌తిరేకం ఇది వ‌ర‌కే ఆమెకు వ్య‌తిరేకంగా వారు బి.ఎం.సి ద్వారా పెద్ద గొడ‌వే చేశారు. ఇప్పుడు ఈ కంప్లైంట్‌తో వారెలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.

రీసెంట్‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడి రైతు చ‌ట్టాల్లో మూడింటిని ఉప‌సంహ‌రించుకుంటున్నామ‌ని తెలిపారు. దీనిపై కంగ‌నా ఘాటుగాగానే రియాక్ట్ అయ్యారు. సిగ్గు, అవ‌మాన‌క‌రంగా ఉంద‌ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంటులో కూర్చున్న వారు చ‌ట్టాలు చేస్తే, వీధుల్లో ఉండేవాళ్లు స‌ద‌రు చ‌ట్టాల‌ను రూపొందించ‌డంలో భాగం కాకుండా వాటిని వ్య‌తిరేకిస్తున్నార‌ని కంగనా ర‌నౌత్ పేర్కొన్నారు.

2009లో ప్ర‌భాస్ జోడిగా ఏక్ నిరంజ‌న్‌లో న‌టించింది. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా మారింది. కంగ‌నా ర‌నౌత్ న‌టిగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసి ఇప్ప‌టికి ప‌దిహేనేళ్ల‌వుతుంది. ఈ ప‌దిహేనేళ్ల‌లో ఆమె ఎన్నో ఆటు పోట్ల‌ను ఎదుర్కొంది. క్వీన్, త‌ను వెడ్స్ మ‌ను, త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ సాధించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయ‌న్‌గా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది. మ‌ణిక‌ర్ణికతో డైరెక్ట‌ర్‌గానూ మారింది.