Tollywood : టాలీవుడ్ సినిమాలు మళ్ళీ ఓటీటీలోనే..!

Tollywood : టాలీవుడ్ సినిమాలు మళ్ళీ ఒటీటీలో రిలీజ్ కానున్నాయా ..అంటే తప్పని పరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సి వస్తోంది అని చెప్పుకుంటున్నారట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ థియేటర్స్ లో రిలీజైన 21 రోజుల్లోనే ఓటిటీలో రిలీజ్ అంటూ నిర్మాతలు అధికారకంగా ప్రకటించేశారు. దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే అవకాశం లేదని మాట్లాడుకుంటున్నారు.

once again tollywood movies in OTT...!
once again tollywood movies in OTT…!

 

బాలీవుడ్, కోలీవుడ్ లో వచ్చిన సినిమాని వకీల్ సాబ్ గా తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే దాదాపు సంవత్సరం ఆలస్యం అయిందని ఈ నెల 2న రిలీజ్ చేశారు. కానీ నిర్మాతలకి కాస్త నష్టాలు తప్పలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని ప్రచారరం అవుతోంది. ఈ సినిమా మాత్రమే కాదు పాగల్, గల్లీ రౌడీ, గుడ్ లక్ సఖీ, ఆకాశవాణి లాంటి చిన్న సినిమాలతో పాటు మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Tollywood : టాలీవుడ్ సినిమాలు మరికొన్ని ఓటీటీలో రిలీజ్ అని ప్రకటిస్తారని సమాచారం.

ఇక బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా మే లో రిలీజ్ కాబోతోంది. థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా అదే రోజు రిలీజ్ అని ప్రకటించారు. అలాగే కోలీవుడ్ లో కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ వకీల్ సాబ్, కార్తీ సుల్తాన్ ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైం లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో మరికొన్ని టాలీవుడ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అని ప్రకటిస్తారని సమాచారం.

Advertisement