Aryan Khan: మరింత దారుణంగా షారూఖ్ త‌న‌యుడి పరిస్థితి.. ఇంకా రాని బెయిల్‌..!

Aryan Khan: షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్‌ఖాన్‌కి నిరాశే ఎదుర‌వుతుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చాలా మలుపులు తిరుగుతున్నాయి. అనూహ్యంగా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈయన జైల్లోనే ఉన్నాడు. ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారని.. వాళ్లందరి గురించి తెలియాలంటే తమకు కొన్ని రోజులు సమయం పడుతుందని ఇప్పటికే ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. అందుకే మూడు సార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కూడా తిరస్కరించింది కోర్టు.

TheNewsQube-
Once Again Court Rejected Aryan Khan Bail
Once Again Court Rejected Aryan Khan Bail

సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ కి ముంబై లోని ప్రత్యేక కోర్ట్ బెయిల్ ను నిరాకరించడం జరిగింది. ఆర్యన్ తో పాటుగా అతని స్నేహితుడు అయిన అర్భాజ్ మర్చంట్ మరియు మోడల్ మున్మున్ ధమెచా కూడా నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకొట్రోపిక్ సబ్ స్టాన్స్ చట్టానికి సంబంధించిన పలు కేసులను విచారించడానికి నియమించబడిన జడ్జ్ వివి పాటిల్ బెయిల్ నిరాకరించడం జరిగింది.

డ్ర‌గ్స్ విక్రేత‌ల‌తో ఆర్య‌న్ ఖాన్ చాటింగ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆర్య‌న్ ఖాన్‌కి బెయిల్ ఇవ్వ‌కుండా ఉంటున్నార‌ని స‌మాచారం. నవంబ‌ర్ వ‌ర‌కు ఆర్య‌న్‌కి బెయిల్ రాక‌పోతే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంది.ఆ త‌ర్వాత వ‌రుస సెల‌వులు రానున్న నేప‌థ్యంలో ఆర్య‌న్ ప‌రిస్థితి దారుణంగా మార‌నుంది.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. దాదాపు మూడు వారాలుగా అక్కడే ఉన్నాడు ఆర్యన్ ఖాన్. ఈయన కేసులో పట్టుబడిన తర్వాత షారుక్ ఖాన్ కూడా కొడుకుకు ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నట్లు తెలుస్తుంది.

ఇపుడు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి ఒక హీరోయిన్ తో వాట్సాప్ చాట్ చేసిన సంచలన నిజాలను బయటపెట్టింది. ఆ హీరోయిన్ కొత్తగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిందని.. ఆర్యన్ ఖాన్ ఆ హీరోయిన్ తో డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్ ద్వారా చర్చించారని… వాటి సంబంధిత ఆధారాలను ఎన్‌సీబీ కోర్టుకు సమర్పించింది.