Chiranjeevi: మెగాస్టారా.. మ‌జాకానా..చిరు ట్వీట్‌ని రీట్వీట్ చేసిన ఒలంపిక్స్ సంస్థ‌

Chiranjeevi: స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవి ఎంద‌రో అభిమానుల మ‌న‌సుల‌ని గెలుచుకున్నాడు. ఆయ‌న కేవ‌లం సినిమాల‌తోనే కాక అనేక సేవా కార్య‌క్ర‌మాల‌తోను ప్ర‌జ‌ల మ‌న‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్నారు. క‌రోనా కాలంలో సినిమా వాళ్ల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సైతం సాయం చేశాడు చిరు. ఆయ‌న‌ను కొంద‌రు అభిమానులు దేవుడిగా కొలుస్తున్నారు. దాస‌రి త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీకి పెద్దగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

chiranjeevi

గ‌త ఏడాది సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు మంచి చెడుల గురించి త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌స్తావిస్తుంటారు. అలానే టాలెంట్ ఉన్న వాళ్ల‌ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. రీసెంట్‌గా టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో కాస్యం పతకంను దక్కించుకున్న పీవీ సింధు పై చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు. పీవీ సింధు రెండవ సారి మెడల్ తీసుకు వచ్చినందుకు గాను చిరంజీవి అభినందించాడు.

భారత మహిళ శక్తిని నువ్వు చాటి చెప్పావు అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఈ విజయాలను కొనసాగించాలి.. మహిళలకు మీరు ఆదర్శంగా నిలవాలి.. భారత దేశం గర్వించేలా మీరు చేశారంటూ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక పీవీ సింధుని అభినందిస్తూ ప్ర‌ధాని,రాష్ట్ర‌ప‌తితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే ఒలింపిక్స్ అధికారిక ఖాతా మాత్రం చిరంజీవి ట్వీట్ ను షేర్ చేశారు.

చిరంజీవి ట్వీట్ కు ఒలింపిక్స్ అధికారిక ఖాత నుండి రిప్లై దక్కింది. వాట్ ఆన్ ఇన్సిపిరేషన్ షి ఈజ్ అంటూ ఇండియా హ్యాష్ ట్యాగ్ ను ఇండియా ప్లాగ్ ను షేర్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ను ఇండియన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఎంతో మంది సింధుకి శుభాకాంక్ష‌లు చెప్పిన చిరంజీవి ట్వీట్ కి మాత్ర‌మే ఒలింపిక్ అధికారిక టీమ్ రిప్లై ఇవ్వడం గొప్ప విష‌యం అని అభిమానులు అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి.. కేవలం పీ వీ సింధుకు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా మీరా బాయి చాను గురించి కూడా ప్రస్థావించాడు. కనుక చిరంజీవి ట్వీట్ కు ఒలింపిక్ టీమ్ రిప్లై ఇచ్చారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి త్వ‌ర‌లో క్లారిటీ ఇవ్వ‌నున్నారు.