Oke Oka Jeevitham Movie Review : ఒకే ఒక జీవితం రివ్యూ : ఇంట్రెస్టింగ్ టైమ్ ట్రావెలర్
NQ Staff - September 9, 2022 / 07:48 AM IST

Oke Oka Jeevitham Movie Review : శర్వానంద్ కెరీర్ ఆరంభంలో ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన సినిమా అంటే మినిమంగా ఉంటుందనే అభిప్రాయం ఉండేది. కథ ఎంపిక విషయంలో శర్వానంద్ ని చూసి నేర్చుకోవాలంటూ ఇతర హీరోలకు సలహాలు ఇచ్చేవారు. అలాంటిది శర్వా గడచిన కొంత కాలంగా దారుణమైన పరాజయాలను మూట కట్టుకున్నాడు. దాంతో ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. మరి ఈ సినిమా అయినా ఆయనకు పూర్వ వైభవంను తెచ్చే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Sharwanand Oke Oka Jeevitham Movie Review
కథ :
ఆది, చైతన్య మరియు శ్రీను (శర్వానంద్, వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి) లు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. ముగ్గురు కూడా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ అలా జీవితాన్నినెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. అలాంటి ఆ ముగ్గురికి టైమ్ ట్రావెల్ పై ప్రయోగాలు నిర్వహించే శాస్త్రవేత్త పాల్ కలుస్తారు. వారిని కాల గమనం లో వెనక్కి పంపిస్తానంటూ చెబుతాడు. గతంలో వదిలేసిన వారి కలలను పూర్తి చేసుకోవడం కోసం టైమ్ ట్రావెల్ చేయాలని ఆ ముగ్గురు నిర్ణయించుకుంటారు. అలా వారు చిన్నప్పటి జీవితానికి వెళ్తారు. అప్పుడు ఏం జరిగింది.. అసలు ఎలా సాధ్యం అయ్యింది అనేది కథ.
నటీనటుల నటన :
నటన విషయంలో శర్వానంద్ కి మొదటి నుండే మంచి మార్కులు పడతాయి. ముఖ్యంగా ఇలాంటి పాత్రలు ఆయనకి పడితే ఏ స్థాయిలో అలరిస్తాడో.. ఆ పాత్రకు న్యాయం చేస్తాడో మరో సారి ఈ సినిమా తో నిరూపితం అయ్యింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో నటిస్తూ ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించాడు. ఆయన ఆది పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అమ్మ పాత్రలో మరోసారి అక్కినేని అమల ఒదిగి పోయారు. ఇలాంటి పాత్రలు ఆమె మాత్రమే చేయగలదేమో అన్నట్లుగా ఆమె నటన ఉంది. తల్లిగా అద్భుతమైన ప్రేమను కనబర్చడంలో ఆమె సఫలం అయ్యింది.
ప్రియదర్శి మరియు వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు. హీరో శర్వాకి వీరి సపోర్టింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముగ్గురు నిజమైన స్నేహితులు వెండి తెరపై కనిపిస్తున్నారు అన్నట్లుగా నటించారు. రీతూ వర్మ పాత్ర పరిధి తక్కువగా ఉంది. ఉన్నంతలో ఆమె చూడ్డానికి అందంగా కనిపించి ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు వారి పాత్రల పరిదిలో నటించి మెప్పించారు.

Sharwanand Oke Oka Jeevitham Movie Review
సాంకేతిక నిపుణుల పనితనం :
దర్శకుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ లైన్ ను తీసుకుని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో పాటు మంచి డైలాగ్స్ తో దర్శకుడు శ్రీకార్తీక్ ప్రేక్షకులను కట్టి పడేయడంలో సఫలం అయ్యాడు. తాను అనుకున్న కథను పూర్తిగా ప్రేక్షకులకు చేరువ అయ్యే విధంగా చూపించి చూపించి ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను అత్యంత నాచురల్ గా చూపించి మెప్పించాడు. ఎడిటింగ్ లో చిన్న చిన్న జర్క్ లు మినహా అంతా బాగానే ఉంది. సంగీత దర్శకుడు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పలు సన్నివేశాలకు ప్రాణం పోశాడు అన్నట్లుగా ఉంది. డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. టైమ్ ట్రావెల్ కి సంబంధించిన సన్నివేశాల సమయంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆకట్టుకుంది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ కాన్సెప్ట్
దర్శకత్వం, స్క్రీన్ ప్లే,
ఎమోషనల్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి,
అక్కడక్కడ నాచురాలిటీ మిస్ అయ్యింది
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో చాలా టైమ్ ట్రావెల్ సినిమాలు వచ్చాయి. అయితే ఇది ఒక ఎమోషనల్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అన్నట్లుగా ఉంది. దర్శకుడు శ్రీ కార్తిక్ యొక్క ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. శర్వానంద్ కి ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫ్లాప్ ల పరంపరకి బ్రేక్ పడ్డట్లు అయ్యింది. శర్వానంద్ కి మంచి కథ పడితే నటన విషయంలో ఆయన్ను అడ్డుకునే వారే ఉండరు… ఈ సినిమాలో అదే నిరూపితం అయ్యింది. అక్కినేని అమల ఈ సినిమాకు ప్రదర్శణ ఆకర్షణగా నిలిచారు. ఆమె ఉండటం వల్ల సినిమాకు ప్రమోషన్ దక్కడం నుండి సినిమాలో మంచి ఎమోషన్ పండింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.