Ohmkar: మళ్లీ గడగడలాడించిన ఓంకార్ అన్నయ్య.. దెబ్బకు అంతా షాక్!
NQ Staff - March 5, 2021 / 06:02 PM IST

Ohmkar యాంకర్, హోస్ట్‌గా బుల్లితెర పై ఓంకార్ తనదైన ముద్రను వేశాడు. ఓంకార్ అన్నయ్య అనే పదం వినని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. ఎన్నో సినిమాల్లోనూ ఓంకార్‌ను, ఆయన హోస్టింగ్‌ను వాడేశారు. తెగ ట్రోల్స్ చేస్తూ ఎన్నో పేరడీలు చేశారు .అయితే ఈ మధ్య ఓంకార్ హోస్టింగ్‌లో కాస్త మార్పులు కనిపించాయి.
మునుపటిలా మరీ అంత డ్రామాను పండించడం లేదు. ఒకప్పుడు అయితే ఏడుపులు పెడబొబ్బులు చూడలేకపోయేవారు. కానీ ఇప్పుడు ఓంకార్ కూడా ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోయాడు. ఒకప్పటిలా ఎమోషన్లు పండించాలని చూడటం లేదు. ఓంకార్ కూడా నాటు కామెంట్లు, బూతు డైలాగ్‌లతో రెచ్చిపోతున్నాడు.
అయితే ప్రస్తుతం ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. కావాల్సినంత గ్లామర్ ఉండటంతో షో కూడా బాగానే రన్ అవుతోంది. మోనాల్, ముమైత్ ఖాన్ వంటి హాట్ గ్లామరస్ నటీమణులను తీసుకొచ్చాడు, జడ్జ్ స్థానంలో కూర్చొబెట్టేశాడు. అయితే తాజాగా జడ్జ్ ముమైత్ ఖాన్‌కు ఓంకార్ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.
మళ్లీ గడగడలాడించిన ఓంకార్ అన్నయ్య..: Ohmkar
ఎలిమినేషన్ రౌండ్ వచ్చిందని.. ఒకరు తప్పు చేస్తే వారికి మైనస్ ఇవ్వడం.. అదే తప్పులు మరొకరు చేస్తే ప్లస్ ఇవ్వడం ఏంటి.. చిన్న పిల్లలు వారు మాట్లాడరు.. అని ఇలా చేస్తున్నారా? అంటూ స్టేజ్ మీద అందరి ముందే ముమైత్ ఖాన్‌ను కడిగిపాడేశాడు ఓంకార్. దీంతో అందరూ తెగ సంబరపడిపోయారు.
Okaru chesthe tappu…inkoru chesthe oppu aa?? Judges ni prashninchina #Ohmkar#Dancee+ Sat & Sun at 9 PM on @StarMaa#DanceePlus pic.twitter.com/G6owloXh7s
— starmaa (@StarMaa) March 5, 2021