Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ నడుము.. కొంటెగా కౌంటర్ వేసిన ఓంకార్

Ohmkar Comments on Vishnu Priya In dance Plus
Ohmkar Comments on Vishnu Priya In dance Plus

Vishnu Priya యాంకర్ విష్ణు ప్రియ అంటే ఇప్పుడు అందరికీ సుపరిచితురాలే. కానీ ఒకప్పుడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన విష్ణు ప్రియ చివరకు బుల్లితెర ద్వారా అందరికీ దగ్గరైంది. బుల్లితెర పై విష్ణు ప్రియ చేసే అల్లరి బాగానే క్లిక్ అయింది. మొదట్లో ఆమె గొంతు పై, ఆమె ముక్కు పై విపరీతమైన సెటైర్లు పడేవి. కానీ అవే ఆమెను బాగా ఫేమస్ చేశాయి.

చిన్నప్పటి నుంచి విష్ణుప్రియ యాంకర్ లేదా హీరోయిన్ అవ్వాలని కలలు కన్నదట. కానీ ఎక్కువగా హీరోయిన్ అవుతాననే ఆశలు పెట్టుకుందట. ఏదైనా ఇంటర్వ్యూలు చూస్తుంటే.. అందులో తాను ఎటు వైపు కూర్చుంటాను.. అటు సైడా? ఇటు సైడా? అని చాలా ఆలోచించేదట. అయితే హీరోయిన్ అయి ఇంటర్వ్యూలు ఇస్తానని ఆశపడితే చివరకు ఇంటర్వ్యూలు తీసుకునే యాంకర్‌ని అయ్యానని చెప్పుకొచ్చింది.

బుల్లితెర పై యాంకరింగ్‌లో అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్లు బాగా క్లోజ్ అవుతుంటారు. అలా శ్రీముఖి, విష్ఱు ప్రియలు మంచి స్నేహితులుగా మారారు. ఈ ఇద్దరూ ఏదైనా షోలో కనిపించినా, ఈవెంట్ చేసినా అక్కడంతా రచ్చ రచ్చే. ఈ ఇద్దరూ లౌడ్ స్పీకర్లు భరించడం అంత సులువైన పనేమీ కాదు. ఆ మధ్య ఇద్దరూ కలిసి జీ తెలుగులో ఓ షోలో కనిపించారు. ఇక విష్ణు ప్రియ, శ్రీముఖిలు డ్యాన్స్ చేయడంలో ఎంత స్పెషలిస్ట్‌లో అందరికీ తెలిసిందే.

యాంకర్ విష్ణు ప్రియ నడుము.. Vishnu Priya
విష్ణు ప్రియ ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేస్తుంటుంది. ఆ మధ్య భాను శ్రీ, విష్ణు ప్రియ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లోక్లిక్ అయింది. మళ్లీ తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో విష్ణు ప్రియ దుమ్ములేపింది. ఇక చివర్లో డ్యాన్స్ పర్ఫామెన్స్ తరువాత బాబా భాస్కర్ ఏదో కామెంట్ చేస్తే.. విష్ణు ప్రియ నడుము దగ్గరికి వస్తే మీరు కూడా అంతే మాస్టర్ అంటూ బాబా భాస్కర్‌ పై ఓం కార్ కౌంటర్ వేశాడు.

Advertisement