Mahesh: ఎన్టీఆర్-మ‌హేష్ గేమ్‌షోకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. అభిమానులు సిద్దం కండి..!

Mahesh: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ‌త కొద్ది రోజులుగా జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న‌ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన్ పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

OFICAL annoument on mahesh show.jpf
OFICAL annoument on mahesh show.jpf

త్వ‌ర‌లో ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే మ‌రోవైపు తారక్ ప్రముఖ ఛానల్‏లో ప్రసారమవుతున్న మీలో ఎవరో కోటీశ్వరులు షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రారంభం రోజే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. ఇక ఆ మొదటి రోజే టీఆర్పీ రెటింగ్ రికార్డ్ సృష్టించింది.ఆతర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కు వచ్చి సందడి చేశారు.

ఆతర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత , మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవీశ్రీ హాజరయ్యారు. ఇక ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. మహేష్ తారక్ తో కలిసి సందడి చేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు ఛానెల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది.

OFICAL annoument on mahesh show1
OFICAL annoument on mahesh show1

మహేష్ గెస్ట్ గా రాబోతున్న షోకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రకటించారు. దాంతో తారక్ ఫాన్స్ , మహేష్ ఫాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షో త్వరలో ముగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సాగిన ఈ షో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.