Pawan Kalyan : ఉగాదికి డబుల్ సర్ ప్రైజ్ చేయబోతున్న పవన్ కళ్యాణ్
NQ Staff - March 17, 2023 / 08:30 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు రూపొందుతున్న విషయం తెల్సిందే. హీరోగా ఆయన నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వినోదయ సీతమ్ సినిమా యొక్క రీమేక్ ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ ఉగాది సందర్భంగా సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తో పాటు మరో సినిమా యొక్క సర్ ప్రైజ్ ను కూడా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనే సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఏ సినిమా యొక్క సర్ ప్రైజ్ రాబోతుంది అనేది క్లారిటీ లేదు.
కానీ కచ్చితంగా వినోదయ సీతమ్ రీమేక్ తో పాటు మరో సినిమా యొక్క సర్ ప్రైజ్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా పవన్ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఉగాదికి పవన్ అభిమానులకు డబుల్ ధమాకా ఖాయం.