Ram Charan : రామ్ చరణ్‌-శంకర్ మూవీ టైటిల్ ఫిక్స్.. ఎవరూ ఊహించని టైటిల్ ఇది..!

NQ Staff - March 27, 2023 / 09:41 AM IST

Ram Charan : రామ్ చరణ్‌-శంకర్ మూవీ టైటిల్ ఫిక్స్.. ఎవరూ ఊహించని టైటిల్ ఇది..!

Ram Charan : త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్‌ పూర్తి స్థాయి హీరోగా చేస్తున్న మూవీ ఆర్సీ 15. దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ చేయకుండా కేవలం వర్కింట్ టైటిల్ తోనే సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు.

ఈ క్రమంలోనే శంకర్ మీద మెగా ఫ్యాన్స్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఒక్క అప్ డేట్ లేకుండా, టైటిల్ చెప్పకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం ఏంటని అంతా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అయితే తాజాగా మూవీ టైటిల్ ను నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.

నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే రామ్ చరణ్‌ బర్త్ డే రోజు ఒక పోస్టర్ రిలీజ్ అయినా రిలీజ్ అవుతుందని అంతా ఆశ పడ్డారు.

 Occasion Of Ram Charan Birthday Rc15 Movie Fixed the Title Game Changer

Occasion Of Ram Charan Birthday Rc15 Movie Fixed the Title Game Changer

కానీ వారి ఆశలు నెరవేరలేదు. కేవలం టైటిల్ మాత్రమే చెప్పారు. మరి ఇంతగా ఊరిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. మరి ఈ మూవీ నుంచి పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us