Jr NTR : ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా.. పోస్టు వైరల్..!

NQ Staff - March 26, 2023 / 02:31 PM IST

Jr NTR  : ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా.. పోస్టు వైరల్..!

Jr NTR  : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్‌- లక్ష్మీ ప్రణతి. మొదటి నుంచి వీరు ఎంతో అన్యోన్యంగానే జీవిస్తున్నారు. వీరిద్దరి జంటకు మంచి పేరు కూడా ఉంది. ఎలాంటి వివాదాలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఇక ఎన్టీఆర్ కూడా కెరీర్ పరంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

రీసెంట్ గానే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలను ప్రారంభించాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా ఉండబోతోంది. ఇలా వరుసగా పెద్ద ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు ఎన్టీఆర్‌. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ ఓ పోస్టు చేశాడు.

పోస్టులో ఏమన్నాడంటే..?

Occasion Of Lakshmi Pranathi Birthday Jr NTR Made Post On Social Media

Occasion Of Lakshmi Pranathi Birthday Jr NTR Made Post On Social Media

ఈ రోజు తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఇందులో తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో ఆ పేరుతోనే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే అమ్ములు అంటూ పోస్టు చేశాడు దాంతో ఈ పోస్టు వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయిపోయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us