Comedian Sudhakar : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కమెడియన్ సుధాకర్.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!
NQ Staff - June 18, 2023 / 11:19 AM IST

Comedian Sudhakar : అప్పట్లో కమెడియన్లకు మంచి గుర్తింపు ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హిట్ కావడంలో వారిదే కీలక పాత్ర. కమెడియన్లకు తగ్గట్టు సీన్లు రాసుకునే వారు అప్పటి దర్శకులు. అంతగా వారికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అలాంటి కమెడియన్లలో సుధాకర్ కూడా ఒకరు. టేచల్ టేచల్.. అబ్బా పిచ్చ కొట్టుడు కొట్టారు లాంటి డైలాగులు ఆయన్ను స్టార్ ను చేసేశాయి.
కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. తెలుగులోనే కాకుండా అటు తమిళం, మలయాళంలో కూడా నటించారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో నటించట్లేదు. వయసు పైబడిన కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు.
అనారోగ్య సమస్యలతో ఆయన చాలా అంటే గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఇక తాజాగా ఆయన జీ న్యూస్ లో ఓ ఈవెంట్ కు వచ్చారు. జూన్ 18న ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగులో ‘నేను నాన్న’ అన్న ప్రత్యేక కార్యక్రమంలో సుధాకర్ కనిపించారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సుధాకర్ కు నిలబడేంతో ఓపిక లేకపోయినా బలవంతంగా ఈ షోకు వచ్చారు. ఇందులో అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశారు. తన కొడుకు ఆయనకు కేక్ తినిపిస్తూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ చెప్పడం ఆకట్టుకుంది. ఇందులో సుధాకర్ కళ్లలో నీళ్లు కనిపించాయి. మాట్లాడేందుకు ఓపిక కూడా లేదు. ఆయన్ను ఇలా చూసిన ఆయన ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.