NTR: ఎమ్మార్వో కార్యాల‌యంలో ఎన్టీఆర్.. ఫొటోలు దిగేందుకు పోటీప‌డ్డ అధికారులు

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అతి తక్కువ స‌మ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. మాస్‌, క్లాస్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్నాడు. అంద‌రి హీరోల మాదిరిగానే ఎన్టీఆర్‌కు కూడా ఒక‌ప్పుడు బ్యాడ్ టైం న‌డిచింది. టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో డిప్రెష‌న్‌లో ప‌డ్డాడు.

ఎప్పుడైతే పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన టెంప‌ర్ మూవీ హిట్ అయిందో ఇక అప్ప‌టి నుండి ఎన్టీఆర్ రాత మారింది. వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తూ స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీంగా క‌నిపించ‌నున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల హృదయాల‌ను కొల్ల‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో త్వరలో ‘ ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రసారం చేయ‌నుంది. ఎపుడో పట్టాలెక్కాల్సిన ఈ రియాలిటీ షో కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ షో ఆగష్టు 16 నుంచి టీవీలో ప్రసారం కానున్నట్టు సమాచారం. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉంటే.. హాట్ సీట్‌లో రామ్ చరణ్ అలరించనున్నారు. ఇప్పటికే ఈ రామ్ చరణ్ గెస్ట్‌గా ఈ షో షూట్ చేశారు. ఈ షో నుంచి రామ్ చ‌ర‌ణ్‌ దాదాపు రూ. 25 లక్షల వరకు గెలిచినట్టు సమాచారం. వచ్చిన ఈ మొత్తాన్ని ఓ ఛారిటీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ త్వ‌ర‌లో ఉక్రెయిన్ వెళ్ల‌నుండ‌గా, ఆ షూట్ పూర్త‌య్యాక కొర‌టాల సినిమా చేయ‌నున్నాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తాహశిల్దార్ కార్యాలయంలో సందడి చేశారు. మండలంలోని గోపులారం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినందుకు శుక్రవారం నాడు ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా సమాచారం.

ఎన్టీఆర్ వ‌చ్చాడ‌ని తెలిసి అక్క‌డికి భారీగా చేరుకున్న యువకులు జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ తో రిజిస్ట్రేషన్ అధికారి తహశీల్దార్ కృష్ణకుమార్.. కంప్యూటర్ ఆపరేటర్ రవళి తదితరులు సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‏కు తిరుగు పయనమమ్యారు జూనియ‌ర్. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.