NTR: సోష‌ల్ మీడియాలో 5 మిలియన్ స్టోన్ టచ్ చేసిన తారక్.!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా విడుద‌లైందంటే బాక్సాఫీస్ షేక్ కావ‌డం ఖాయం. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాలో కొమురం భీం పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు. ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో ఎన్టీఆర్ వైవిధ్యంగా క‌నిపించారు. అయితే ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో కూడా తారక్ కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న తాత జ‌యంతి సంద‌ర్భంగా బావోద్వేగ‌పూరిత సందేశాన్ని ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మా గుండెల‌ను మరోసారి తాకి పోండి తాతా అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక నంద‌మూరి అభిమానులు జోహార్ ఎన్టీఆర్‌, జై ఎన్టీఆర్ అంటూ జూనియ‌ర్ ట్వీట్ కు కామెంట్లు జ‌త చేశారు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు 12 వేల‌కుపై రీట్వీట్స్ రాగా..38వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. అయితే తాజాగా తారక్ తన ట్విట్టర్ ఖాతాను 5 మిలియన్ మార్క్ కు చేరుకున్నాడు. దీంతో నంద‌మూరి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.