NTR Trip With Family: పిల్లలతో చిల్ అవుతున్న ఎన్టీఆర్…

NTR Trip With Family: ఓవైపు సినిమాలు, మరోవైపు రియాలిటీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్‌.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

NTR Trip With Family in Spain
NTR Trip With Family in Spain

ఇలా బిజీ బిజీగా గడుపుతోన్న ఎన్టీఆర్‌ తాజాగా.. అనుకోకుండా ఫ్యామిలీ తో టూర్ వేశారు. రెండు రోజుల క్రిత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పారిస్ కి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు తన వారసులతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోలలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నాడు ఎన్టీఆర్.

నిన్నటికి నిన్న పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతూ కనిపించిన తారక్ తాజాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని షేర్ చేశాడు.

NTR Trip With Family in Spain
NTR Trip With Family in Spain

ట్రైన్ లో భార్గవ్ రామ్ ని ముద్దాడుతూ కనిపించాడు .. మరో ఫొటోలో ఎన్టీఆర్ భార్య ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్న భార్గవ్ ఇంకా ముద్దొచ్చేస్తున్నాడు.. ఈ అందమైన ఫోటోలకు ఇంకా అందంగా క్యాప్షన్ ఇచ్చాడు తారక్.

” నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.